Rana Daggubati : చైతన్యతో విడాకులు తరువాత కూడా నేను సమంతతో కాంటాక్ట్‌లోనే ఉన్నా.. రానా!

టాలీవుడ్ లో అందరూ మెచ్చిన స్టార్ కపుల్ అంటే.. అది అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతారు అని ఎవరు అనుకోలేదు. 2017 లో పెళ్లి చేసుకున్న నాగచైతన్య, సమంత.. 2021 లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వార్త మీడియాలో హాట్ టాపికే. తాజాగా టాలీవుడ్ హాంక్ రానా దగ్గుపాటి చేసిన వ్యాఖ్యలు ఈ టాపిక్ ని మరోసారి తెర పైకి తీసుకు వచ్చాయి.

Rana Daggubati : చైతన్యతో విడాకులు తరువాత కూడా నేను సమంతతో కాంటాక్ట్‌లోనే ఉన్నా.. రానా!

Rana Daggubati

Rana Daggubati : టాలీవుడ్ లో అందరూ మెచ్చిన స్టార్ కపుల్ అంటే.. అది అక్కినేని నాగచైతన్య, సమంత జోడి అనడంలో సందేహం లేదు. అటువంటి జోడి విడిపోతారు అని ఎవరు అనుకోలేదు. అది అంతా ఒక కల అయితే బాగుండు అని అక్కినేని అభిమానులతో పాటు టాలీవుడ్ అభిమానులు కూడా కోరుకుంటుంటారు. 2017 లో పెళ్లి చేసుకున్న నాగచైతన్య, సమంత.. 2021 లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వార్త మీడియాలో హాట్ టాపికే. తాజాగా టాలీవుడ్ హాంక్ రానా దగ్గుపాటి చేసిన వ్యాఖ్యలు ఈ టాపిక్ ని మరోసారి తెర పైకి తీసుకు వచ్చాయి.

Rana Daggubati : ప్రభాస్, మహేష్ బాబు ఎవరో బాలీవుడ్ వాళ్లకు తెలీదంట.. రానా సంచలన వ్యాఖ్యలు..

ప్రస్తుతం రానా.. రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కూడా ఈ సిరీస్ లో నటిస్తున్నాడు. మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. దీంతో రానా వరుస ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”నేను సమంతతో ఇప్పటికీ కాంటాక్ట్‌లోనే ఉన్నాను. తరుచు తనతో మాట్లాడుతుంటాను. ఇటీవల మాయోసైటిస్ వ్యాధి వచ్చినప్పుడు కూడా తనకి కాల్ చేసి తన పరిస్థితి తెలుసుకున్నాను. సినిమా వాళ్ళ జీవితం ప్రత్యేకంగా పులా పాన్పులా ఏమీ ఉండదు. వారి జీవితంలో కూడా కష్టాలు ఉంటాయి. వాటిని బయటకి చెప్పుకోవాలా? లేదా? అనేది వారి వ్యక్తిగతం. కానీ ఆ సమస్యలను ఎలా ఎదురుకున్నాము. వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడంలోనే ఆనందం, జీవితం ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా ఇటీవల కాలంలో అక్కినేని కుటుంబానికి చెందిన అఖిల్, సుశాంత్ కూడా సమంత అనారోగ్య సమయంలో స్పందించడం, సమంత సినిమాలకు కూడా అభినందనలు తెలియజేస్తూ పోస్ట్ లు పెట్టడం చూస్తున్నాము. తాజాగా రానా కూడా సమంతతో క్లోజ్ గా ఉన్నట్లు చెప్పుకు రావడం చూస్తుంటే.. విడాకులు తరువాత కూడా సమంత, అక్కినేని కుటుంబంతో మంచి రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తుంది అని అర్ధమవుతుంది.