Ranbeer Kapoor : పెళ్లయ్యాక జీవితం ఏం మారలేదు.. ఆలియాతో పెళ్లిపై స్పందించిన రణబీర్..

తాజాగా రణబీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో పెళ్లి అయ్యాక మీ జీవితం ఎలా ఉంది అని అడగడంతో రణబీర్ ఇచ్చిన ఆన్సర్ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆలియాతో తన పెళ్లిపై రణబీర్ మాట్లాడుతూ..''పెళ్లి వల్ల మా జీవితాల్లో............................

Ranbeer Kapoor : పెళ్లయ్యాక జీవితం ఏం మారలేదు.. ఆలియాతో పెళ్లిపై స్పందించిన రణబీర్..
ad

Alia Bhatt :  బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్ రణబీర్ కపూర్, ఆలియా భట్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉండి ఇటీవలే వివాహం చేసుకున్నారు. ఈ సెలబ్రిటీ కపుల్ ఐదేళ్లుగా సహ జీవనం చేసి కొన్ని రోజుల క్రితమే మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు.

తాజాగా రణబీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో పెళ్లి అయ్యాక మీ జీవితం ఎలా ఉంది అని అడగడంతో రణబీర్ ఇచ్చిన ఆన్సర్ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆలియాతో తన పెళ్లిపై రణబీర్ మాట్లాడుతూ..”పెళ్లి వల్ల మా జీవితాల్లో కొత్తగా ఏమి మారలేదు. ఆలియా, నేనూ గత ఐదేళ్లుగా కలిసే ఉంటున్నాం. మా జీవితం పట్ల మా ధృక్పథాలు, ఆలోచనలు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాయి. పెళ్లయిన నెక్స్ట్ డే నేను, ఆలియా ఎవరి షూటింగ్‌లకు వాళ్లం వెళ్లిపోయాం. వీలు కుదిరితే కాస్త విరామం తీసుకొని ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నాము కానీ టైం దొరకట్లేదు. ఆలియా ప్రస్తుతం ఓ హాలీవుడ్‌ సినిమాలో నటిస్తుంది. నేనలాంటి ప్రయత్నాలు అస్సలు చేయను. ఇప్పుడు వేరే భాషలో సినిమా కోసం వెళ్లి అక్కడ ఆడిషన్స్‌ ఇవ్వడం నాకు ఇష్టం లేదు” అని తెలిపాడు.

Anushka Shetty : అనుష్క సోదరుడి హత్యకు కుట్ర.. హోంమంత్రిని ఆశ్రయించిన అనుష్క సోదరుడు..

ఆలియాతో పెళ్లిపై రణబీర్ ఇలా మాట్లాడేసరికి అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. పెళ్లి జీవితం గురించి కొత్తగా, ఎంతో ఆసక్తిగా చెప్తారు అనుకుంటే ఇలా సింపుల్ గా చెప్పడేంటి అని అనుకుంటున్నారు.