Ravanasura : బర్త్ డే గిఫ్ట్ రెడీ చేస్తున్న రావణ.. రావణాసుర గ్లింప్స్!

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో రావణాసుర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా ఈ నెల 26న రవితేజ పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ బర్త్ డే గిఫ్ట్ రెడీ చేస్తున్నారు.

Ravanasura : బర్త్ డే గిఫ్ట్ రెడీ చేస్తున్న రావణ.. రావణాసుర గ్లింప్స్!

ravanasura

Ravanasura : టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇటీవల ధమాకా సినిమాతో కెరీర్ లోనే మొదటిసారి 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టాడు. తాజాగా చిరంజీవి వాల్తేరు వీరయ్యలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో రావణాసుర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ షూటింగ్ ప్రెజెంట్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.

Raviteja-Siddhu : రవితేజ-సిద్ధూ జొన్నలగడ్డ కాంబినేషన్ లో సినిమా??

కాగా ఈ నెల 26న రవితేజ పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ బర్త్ డే గిఫ్ట్ రెడీ చేస్తున్నారు. ఈ గురువారం సినిమాకి సంబంధించిన వీడియో గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నట్లు ఒక ప్రమోషనల్ వీడియోని రిలీజ్ చేశారు. ‘హీరోస్ డోంట్ ఏక్సిస్ట్’ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ మూవీలో రవితేజ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాని సామీ రారా ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీకాంత విస్సా కథ, కథనాన్ని అందిస్తున్నాడు.

ఈ చిత్రంలో భారీ తారాగణం కనిపించబోతుంది. అక్కినేని నటుడు సుశాంత్ ఈ మూవీలో విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ.. అందాల భామలు ఈ చిత్రంలో మెరవబోతున్నారు. రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్, జై రామ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భీమస్ సెసిరోలె ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. రవితేజ టీం వర్క్స్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమాతో రవితేజ తన హిట్టు పరంపరని కొనసాగిస్తాడా లేదా అనేది చూడాలి.