Khiladi: మీనాక్షికి మాస్‌రాజా లిప్‌లాక్.. మరీ ఇంత దూకుడా?

రవితేజ తన కెరీర్ లోనే ఎన్నడూ చూడని దూకుడు చూపిస్తున్నాడు ఇప్పుడు. క్రాక్ సక్సెస్ తర్వాత పడిలేచిన కెరటంలో మారిన మాస్ రాజా వరస పెట్టి సినిమాలను చేసేస్తున్నాడు. ఇప్పటికే రమేష్ వర్మ..

Khiladi: మీనాక్షికి మాస్‌రాజా లిప్‌లాక్.. మరీ ఇంత దూకుడా?

Khiladi

Khiladi: రవితేజ తన కెరీర్ లోనే ఎన్నడూ చూడని దూకుడు చూపిస్తున్నాడు ఇప్పుడు. క్రాక్ సక్సెస్ తర్వాత పడిలేచిన కెరటంలో మారిన మాస్ రాజా వరస పెట్టి సినిమాలను చేసేస్తున్నాడు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ చేసిన ‘ఖిలాడీ’ సినిమా విడుదలకి సిద్దమవగా.. ఖిలాడీ సెట్స్ మీద ఉండగానే రామారావు ఆన్ డ్యూటీ సినిమా ముమ్మర షూటింగ్ లో ఉంది. ఆ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాకముందే మరో మూడు సినిమాలను కూడా మొదలుపెట్టేశాడు.

Khiladi Trailer: పేకాటలో నలుగురు కింగ్స్.. ఈ ఆటలో ఒక్కడే కింగ్!

ఖిలాడీ రిలీజ్ కాగానే మరో రెండు సినిమాల షూటింగ్ లో జాయిన్ కానున్నాడు రవితేజ. జస్ట్ సినిమాలను ఒప్పుకొనే విషయంలోనే కాదు వాటిని పూర్తిచేయడంలో కూడా ఫుల్ స్వింగ్ చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు తెలుగు, తమిళ బాషల మీదనే ఫోకస్ చేసిన రవితేజ ఇప్పుడు బాలీవుడ్ మీద కూడా కన్నేశాడు. ఫిబ్రవరి 11న రిలీజ్ కానున్న ఖిలాడీ సినిమాను డైరెక్ట్ గా హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాడు.

Samantha: సామ్ డిసిప్లైన్ కొటేషన్.. సోషల్ మీడియాలో చర్చ!

సినిమాలకు సైన్ చేయడం.. పూర్తి చేయడం.. ఇతర బాషలలో మార్కెట్ పెంచుకోవడమే కాదు.. కాలానికి తగ్గట్లుగా కూడా తనని తాను మార్చుకుంటున్నాడు మాస్ రాజా. ఇప్పుడున్న యంగ్ హీరోలతో పోటీ పడాలంటే కొన్ని కొన్నిటిలో మార్పు తప్పదు అనుకున్నాడేమో ఏకంగా లిప్ లాక్ కూడా చూపించేశాడు. తాజాగా రిలీజ్ చేసిన ఖిలాడీ ట్రైలర్ లో రవితేజ మీనాక్షి మధ్య రొమాన్స్ హాట్ టాపిక్ గా మారింది. మరి మాస్ రాజా దూకుడు ఎన్నాళ్ళో ఇలా!