Bigg Boss 5 : నా వల్ల కాదు.. నేను బిగ్ బాస్ నుంచి వెళ్లిపోతా

గతంలో కొంతమంది సభ్యులు గేమ్ మధ్యలోనే తమంతట తాము వెళ్లిపోయారు. మరి ఈ సారి కూడా ఎవరైనా వెళ్తారా అని ఆలోచిస్తుండగా యాంకర్ రవి ఈ వ్యాఖ్యలు చేశాడు.

Bigg Boss 5 : నా వల్ల కాదు.. నేను బిగ్ బాస్ నుంచి వెళ్లిపోతా

Ravi

Bigg Boss 5 :  బిగ్ బాస్ 5వ సీజన్ ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకుంది. కంటెస్టెంట్స్ అందరూ గొడవలు పడుతూనే ఉన్నారు. కెప్టెన్సీ కోసం లేక నామినేషన్స్ టైంలో గొడవలు బాగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఏడుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం మరో కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అవ్వనున్నారు. ఇన్ని రోజుల నుంచి ఫ్యామిలీకి , బయట ప్రపంచానికి దూరంగా ఉండే కంటెస్టెంట్స్ కి ఫ్యామిలీల నుంచి వచ్చిన లెటర్స్ ని కూడా నామినేషన్స్ లో భాగంగా ఉపయోగించి లెటర్స్ చాలా మందికి దక్కకుండా చేశాడు బిగ్ బాస్. గతంలో కొంతమంది సభ్యులు గేమ్ మధ్యలోనే తమంతట తాము వెళ్లిపోయారు. మరి ఈ సారి కూడా ఎవరైనా వెళ్తారా అని ఆలోచిస్తుండగా యాంకర్ రవి ఈ వ్యాఖ్యలు చేశాడు.

Samantha : థంబ్‌నైల్స్‌తో మాకు సంబంధం లేదు.. సమంత కేసులో స్పందించిన డాక్టర్ సీఎల్ వెంకట్‌రావు

యాంకర్ రవి హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ… “నేను కొన్ని రోజులుగా మానసిక సంఘర్షణను ఎదుర్కొంటున్నాను. నేను డబ్బుల కోసం రాలేదు. నా భార్య నిత్య, కూతురు వియా ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఉంది. వాళ్లు ఎలా ఉన్నారో చెప్పండి, లేదంటే నన్నైనా బయటకు పంపండి. బయటకి వెళ్లిపోవడానికి కూడా నేను సిద్ధమే, కానీ ఈ ఒత్తిడి నా వల్ల కావడం లేదు” అంటూ బాధపడ్డాడు. మరి రవి నిజంగానే వెళ్ళిపోతాడా? లేదా బిగ్ బాస్ పంపిస్తాడా అని ఆలోచిస్తున్నారు ప్రేక్షకులు.

Manchu Manoj : నా పెళ్ళికి నన్ను కూడా పిలవండి : మంచు మనోజ్

రవి ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత మానస్‌ రవి గురించి మాట్లాడుతూ.. రవి గేమర్‌ అని, అతడు ఎప్పుడు? ఎవరిని ఎలిమినేట్‌ చేయాలి? అని ప్లాన్‌ చేస్తుంటాడని కాజల్‌తో చెప్పాడు. ఇప్పుడు మాట్లాడింది అంతా కూడా గేమ్ లో భాగమే అని అన్నాడు. రవి చాలా తెలివిగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడని అన్నాడు. చూడాలి మరి.. రవి వెళ్ళిపోతాడా? ఆయన కోరుతున్నట్టు ఏదైనా ఫ్యామిలీ మీటింగ్‌కు బిగ్ బాస్ ప్లాన్ చేస్తాడా…?