Ram Gopal Varma : రామ్‌చరణ్ చాలా బోరింగ్ పర్సన్.. రామ్ గోపాల్ వర్మ!

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం 'డేంజరస్' ఈ శుక్రవారం విడుదల కానుంది. తెలుగులో ఫస్ట్ లెస్బియన్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వర్మ 10tv ఛానల్ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గురించి ప్రశ్నించగా..

Ram Gopal Varma : రామ్‌చరణ్ చాలా బోరింగ్ పర్సన్.. రామ్ గోపాల్ వర్మ!

RGV comments on Ram Charan

Updated On : December 9, 2022 / 7:53 AM IST

Ram Gopal Varma : టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ చాలా బోరింగ్ అంటున్న రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం ఈ దర్శకుడు తెరకెక్కించిన రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం ‘డేంజరస్’ ఈ శుక్రవారం విడుదల కానుంది. తెలుగులో ఫస్ట్ లెస్బియన్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వర్మ 10tv ఛానల్ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోని పలువురు స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Ram Charan : మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ లిస్ట్‌లో.. బన్నీ, ఎన్టీఆర్ కంటే ముందు స్థానంలో రామ్‌చరణ్..

ఇక ఈ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గురించి ప్రశ్నించగా.. “రామ్ చరణ్ ఒక పర్ఫెక్ట్ జెంటిల్‌మ్యాన్. ఒక నటుడిగా ఆ పాత్ర కోసం, సినిమా కోసం చరణ్ పని చేసే విధానం అద్భుతం. అలాగే గుడ్ లుక్కింగ్ పర్సన్. కానీ స్టార్ ఇమేజ్ ఉన్నా ఒక ఆర్డినరీ పర్సన్ లా ఉంటూ, తన బేసిక్ మెంటాలిటీతో ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా ఉండడం మనలని బోరింగ్ గురి చేస్తాయి” అంటూ కామెంట్స్ చేశాడు.

దీంతో చరణ్ అభిమానులు.. వర్మ తమ అభిమాన హీరోని తిట్టాడా? పొగిడాడా? తెలియక తికమక పడుతున్నారు. కాగా ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. RC15 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.