RGV: పఠాన్ సునామీపై వర్మ కామెంట్స్.. షారుక్‌తో మామూలుగా ఉండదట!

వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తన సోషల్ మీడియా అకౌంట్‌లో పలు అంశాలపై స్పందిస్తూ ఉంటాడు. తాజాగా ఆయన బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన పఠాన్ మూవీపై తనదైన కామెంట్స్ చేసి అందరి చూపులను తనవైపుకు తిప్పుకున్నాడు. తనకు పఠాన్ సినిమా బాగా నచ్చిందని.. షారుక్‌పై విమర్శలు చేసినవారందరూ ఈ సినిమా చూసి మాట్లాడాలంటూ కామెంట్ చేశాడు.

RGV: పఠాన్ సునామీపై వర్మ కామెంట్స్.. షారుక్‌తో మామూలుగా ఉండదట!

RGV Comments On Shah Rukh Khan Pathaan Collections

RGV: వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తన సోషల్ మీడియా అకౌంట్‌లో పలు అంశాలపై స్పందిస్తూ ఉంటాడు. తాజాగా ఆయన బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన పఠాన్ మూవీపై తనదైన కామెంట్స్ చేసి అందరి చూపులను తనవైపుకు తిప్పుకున్నాడు. తనకు పఠాన్ సినిమా బాగా నచ్చిందని.. షారుక్‌పై విమర్శలు చేసినవారందరూ ఈ సినిమా చూసి మాట్లాడాలంటూ కామెంట్ చేశాడు.

RGV: అవతార్-2 డైరెక్టర్‌పై వర్మ కామెంట్స్.. దేవుడితో సమానమట!

అంతేగాక, పఠాన్ సినిమాపై తనదైన రీతిలో పాయింట్స్‌ను వివరించాడు ఈ డైరెక్టర్. పఠాన్ సినిమా రిలీజ్‌కు ముందు ఉన్న పరిస్థితులను ప్రస్తావిస్తూ, ఇప్పుడు ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ను ఆయన వెల్లడించాడు. ఈ క్రమంలో పఠాన్ సినిమా రిలీజ్‌కు ముందు.. ఓటీటీల కారణంగా బాలీవుడ్ థియేటర్ కలెక్షన్స్ పుంజుకోవడం కష్టమని.. షారుక్ ఓ ఫేడవుట్ అవుతున్న స్టార్ అని.. సౌత్ మసాలా డైరెక్టర్స్ లాగా బాలీవుడ్‌లో కమర్షియల్ బ్లాక్‌బస్టర్ ఎప్పటికీ తెరకెక్కించలేరని.. కేజీయఫ్-2 డే1 కలెక్షన్స్‌ను అధిగమించాలంటే కొన్నేళ్లు పడుతుందనే వాదనలు బాగా ఉన్నాయని.. ఇలాంటి వాటన్నింటికీ పఠాన్ చెక్ పెట్టి మరీ సమాధానమిచ్చాడంటూ వర్మ తెలిపాడు.

ఇలా పఠాన్ సినిమా గురించి పాజిటివ్‌గా కామెంట్ చేస్తూ షారుక్‌ను ఆకాశాకితెత్తుకొచ్చాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. అటు పఠాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ కలెక్షన్స్‌తో సునామీ సృష్టించడం తనకు సంతోషాన్ని కలిగిస్తుందని.. మున్ముందు మరిన్ని బాలీవుడ్ సినిమాలు ఇలాంటి ఫీట్ సాధించాలని వర్మ కోరారు.