RGV : ఆర్జీవీ వ్యూహం మాములుగా లేదుగా.. అన్ని పార్టీలని కలగాపులగం చేసేసి..

తాజాగా ఆర్జీవీ చేసిన ట్వీట్ ప్రేక్షకులని మళ్ళీ అయోమయంలో పడేసింది. తాజాగా ఆర్జీవీ.. BJP ÷ PK x CBN - LOKESH + JAGAN = వ్యూహం అంటూ ట్వీట్ చేశారు. అంటే తను తీయబోయే సినిమాలో.............

RGV : ఆర్జీవీ వ్యూహం మాములుగా లేదుగా.. అన్ని పార్టీలని కలగాపులగం చేసేసి..

RGV new tweet on Vyuham Movie

RGV :  ఆర్జీవీ సెన్సేషనలయ్యే సినిమాలు తీస్తాడన్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా రాజకీయ నాయకులని, పార్టీలని టార్గెట్ చేస్తూ కొన్ని సినిమాలు కూడా చేశాడు. ఇటీవల ఆర్జీవీ ఏపీ సీఎం జగన్ ని కలిసి ఏకాంతంగా దాదాపు 40 నిమిషాలపాటు మాట్లాడారు. ఈ మీటింగ్ అటు రాజకీయ వర్గాల్లోనూ, సినీ వర్గాల్లోనూ చర్చగా మారింది. ఈ మీటింగ్ తర్వాత ఆర్జీవీ వ్యూహం, శపథం అనే రెండు సినిమాలు తీయబోతున్నట్టు ప్రకటించారు.

ఈ రెండు సినిమాలు ఎవరి బయోపిక్ లు కాదు కానీ రియల్ పిక్ లు. రాజకీయాల మీదే ఉండబోతున్నాయి ఈ సినిమాలు. మొదటి సినిమా వ్యూహం చూసి ప్రేక్షకులు తేరుకునేలోపే రెండో సినిమా శపథం రిలీజ్ చేసి షాక్ ఇస్తాను అని చెప్పి ఆర్జీవీ అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీంతో ఈ రెండు సినిమాలు జగన్ కి అనుకూలంగా ఏపీ రాజకీయాలపై ఉండబోతుందని అంతా అనుకున్నారు.

Ram Gopal Varma: వంగవీటి సినీ నిర్మాతతో RGV కొత్త సినిమా.. రెండు భాగాలుగా రాబోతున్నట్లు ప్రకటన!

తాజాగా ఆర్జీవీ చేసిన ట్వీట్ ప్రేక్షకులని మళ్ళీ అయోమయంలో పడేసింది. తాజాగా ఆర్జీవీ.. BJP ÷ PK x CBN – LOKESH + JAGAN = వ్యూహం అంటూ ట్వీట్ చేశారు. అంటే తను తీయబోయే సినిమాలో అన్ని పార్టీల గురించి కచ్చితంగా చూపించబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఆర్జీవీ చేసిన ట్వీట్ కి అర్ధం ఏంటో, ఆ పార్టీల లెక్కలకి మీనింగ్ ఏంటో ఆయనకే తెలియాలి. ఇప్పుడు రాజకీయ వర్గాలన్నీ ఆ ట్వీట్ కి అర్ధం ఏంటా అని తలలు పట్టుకుంటున్నారు. ఏదేమైనా మళ్ళీ ఆర్జీవీ తన సినిమాతో ఏపీ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించబోతున్నారని అర్ధమవుతుంది.