RGV : శివ సినిమా క్లైమాక్స్ ఆ బిల్డింగ్ పైనే షూట్ చేశాను.. స్వప్నలోక్ అగ్నిప్రమాదంపై ఆర్జీవీ వ్యాఖ్యలు..
ఈ ప్రమాదంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ ఆసక్తికర ట్వీట్ ని షేర్ చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ...............

RGV : గురువారం మార్చ్ 16న రాత్రి సమయంలో సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటికే ఆరుగురు మరణించగా మరికొంతమంది క్షతగాత్రులయ్యారు. పలువురు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఈ ప్రమాదంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ ఆసక్తికర ట్వీట్ ని షేర్ చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ.. ఈ సంఘటన చాలా బాధాకరం. నా మొదటి సినిమా శివ సినిమాలోని క్లైమాక్స్ ఫైట్ నాగార్జున, రఘువరన్ మధ్య ఈ బిల్డింగ్ పైనే చిత్రీకరించాం అని తెలిపాడు. దానితో పాటు ఓ నెటిజన్ పోస్ట్ చేసిన ఆ ఫైట్ సీన్ ని కూడా షేర్ చేశాడు ఆర్జీవీ. దీంతో ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
Aha : ఆహా ఉగాది స్పెషల్ ఆఫర్.. 99 రూపాయలకే..
ఇప్పటికే శివ సినిమా వచ్చి 33 ఏళ్ళు అయింది. అప్పటికే స్వప్నలోక్ బిల్డింగ్ కట్టేసి ఉందంటే దానికి ఇంత చరిత్ర ఉందా, మూడు దశాబ్దాల క్రితం బిల్డింగా అది అని ఆశ్చర్యపోతున్నారు జనాలు.
Very sad to see this ..Incidentally the climax fight of Shiva between @iamnagarjuna and #RaghuVaran has been shot on top of this building https://t.co/DMBek9jnZH
— Ram Gopal Varma (@RGVzoomin) March 17, 2023