RRR Update: ఆర్ఆర్ఆర్ సాలిడ్ అప్‌డేట్.. రేపే సెన్సేషనల్ డ్యాన్స్ బీట్ రిలీజ్

ఆర్ఆర్ఆర్ సినిమాకు.. అద్దిరిపోయే అప్ డేట్ బుధవారం రానుంది. నాటు నాటు.. అంటూ సాలిడ్ మాస్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.

RRR Update: ఆర్ఆర్ఆర్ సాలిడ్ అప్‌డేట్.. రేపే సెన్సేషనల్ డ్యాన్స్ బీట్ రిలీజ్

Rrr

RRR Update: పాన్ ఇండియా లెవల్ లో మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్.. సూపర్ ఫాస్ట్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. దోస్తీ సాంగ్, అల్లూరి, కుమురం భీం క్యారెక్టర్ల పరిచయం, ఫస్ట్ లుక్స్ రిలీజ్, గ్లింప్స్ తో సూపర్ బజ్ తెచ్చుకున్న ఈ సినిమాకు.. అద్దిరిపోయే అప్ డేట్ బుధవారం రానుంది. నాటు నాటు.. అంటూ సాలిడ్ మాస్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇదో సెన్సేషనల్ డ్యాన్స్ నంబర్ గా.. చరణ్, ఎన్టీఆర్ పోటీ పడి మరీ డ్యాన్స్ చేసినట్టుగా పబ్లిసిటీని బట్టి అర్థమవుతోంది.

ఈ సాంగ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు.. దర్శకుడు రాజమౌళి అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్రీట్ ఇచ్చారు. ఓ ఈవెంట్ కు హాజరైన ఆయన.. సినిమాలోని డైలాగ్ ను షేర్ చేసుకున్నారు. “యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి”.. అంటూ RRR లో డైలాగ్ ఉందని.. చెప్పారు. ఛాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజమౌళితో పాటు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, డాక్టర్ రవి హాజరయ్యారు.

పిల్లల్లో అనారోగ్య సమస్యలు.. 90 శాతం వరకూ తగ్గిపోయేవే అని రాజమౌళి చెప్పారు. ఈ దిశగా శ్రమిస్తున్న ఛాయిస్ ఫౌండేషన్ ను ప్రశంసించారు. ఈ క్రమంలోనే.. తన సినిమాలోని డైలాగ్ ను పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ ఓ యాక్షన్ థ్రిల్లర్ అని అంతా భావిస్తున్నారు. అందుకు తగ్గట్టే.. రాజమౌళి చెప్పిన డైలాగ్ ఉండడంతో.. యుద్ధం ఎవరిది.. ఎవరు ఎవరితో చేస్తారు.. అన్న చర్చ జోరందుకుంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. అన్నంత స్థాయిలో ఈ యుద్ధం గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు.

ఒక్క డైలాగ్ కే ఇంతటి బజ్ క్రియేట్ అయితే.. రేపు రిలీజ్ అయ్యే సాంగ్ తో ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో.. అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ తో రాజమౌళి అందరి అటెన్షన్ ను తనవైపు తిప్పుకొంటున్నాడనే చెప్పాలి.

RRR డైలాగ్ లీక్ చేసిన రాజమౌళి.. గూస్ బంప్స్ గ్యారంటీ

RRR Glimpse : ఎన్టీఆర్ – చరణ్ ఫ్యాన్స్ థియేటర్లలో సీట్లు చింపే సీన్ ఇదేనేమో?

RRR Glimpse : రికార్డుల హంటింగ్ స్టార్ట్ చేశారుగా!

RRR : అలియాభట్.. ఆర్ఆర్ఆర్ లో నన్ను టార్చర్ పెట్టింది..

RRR Glimpse : గోండు బెబ్బులి గోళ్లు ఆ సినిమా నుండి తీసుకున్నారా?