RRR: HCAలో దుమ్ములేపిన ఆర్ఆర్ఆర్.. రెండో ప్లేస్ కైవసం!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్....

RRR: HCAలో దుమ్ములేపిన ఆర్ఆర్ఆర్.. రెండో ప్లేస్ కైవసం!

Rrr Stood As Runner Up In Hca Midseason Awards

RRR: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లను ఓ ఫిక్షన్ కథలో ఆయన వాడిన తీరు అమోఘం. ఇక ఈ సినిమాకు యావత్ సినీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ఈ సినిమా పేరు ఇప్పటికీ మార్మోగుతూ ఉంది. ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉన్నా, సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి రోజూ చర్చ సాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ ఆర్ఆర్ఆర్ చిత్రం మరో నయా రికార్డును క్రియేట్ చేసింది.

RRR : 57 దేశాల్లో ట్రెండింగ్‌లో ఉన్న RRR.. దుమ్ము దులిపేస్తున్న చరణ్, తారక్..

హాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాలు, జనాదరణ పొందిన సినిమాలను ఎంపిక చేసి.. వాటిలో ఉత్తమ చిత్రాలకు అవార్డులు అందించే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్(HCA) మిడ్‌సీజన్ అవార్డ్స్‌లో ఇటీవల ఇండియా నుండి ఆర్ఆర్ఆర్ ఎంపికైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ అవార్డుల జాబితాను రిలీజ్ చేసింది సదరు HCA. ఈ సందర్భంగా ఉత్తమ చిత్రంగా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ అనే సినిమాకు బెస్ట్ మూవీ అవార్డును ప్రకటించగా, రన్నర్ అప్‌గా ఆర్ఆర్ఆర్ నిలిచినట్లు HCA ప్రకటించింది. దీంతో హాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఆర్ఆర్ఆర్ అలరించడంలో సక్సెస్ అయ్యిందని మరోసారి రుజువయ్యింది.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ గే సినిమానా?? వాళ్ళకి ఇలా అర్థమైందా?? ఆర్జీవీ చెప్పింది నిజమేనా??

ఈ పోటీలో హాలీవుడ్ సూపర్ చిత్రాలు బరిలో ఉన్నా, వాటన్నింటినీ పక్కకునెట్టి ఏకంగా రెండో ప్లేస్‌లో ఆర్ఆర్ఆర్ నిలిచిందంటే, ఇది మామూలు విషయం కాదని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా జక్కన్న క్రియేట్ చేసిన ఈ సెన్సేషనల్ మూవీ మున్ముందు ఇంకా ఎలాంటి అవార్డులు అందుకుంటుందో చూడాలని వారు అంటున్నారు. ఇక ఈ సినిమాలో అజయ్ దేవ్గన్, ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమాను డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే.