Sai Dharam Tej : నీ స్నేహం నాతో ఇలానే ఉండాలి.. ఎన్టీఆర్‌పై సాయి‌ధరమ్ కామెంట్స్!

ఎట్టకేలకు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన సినిమా నుంచి అప్డేట్ ఇచ్చేశాడు. లేట్ గా వచ్చిన లేటెస్ట్ వస్తాను అన్నట్టే ఉంది టైటిల్ టీజర్ కూడా. అదిరిపోయే విజువల్స్ తో ఆకట్టుకోవడమే కాదు, కొత్త కాన్సెప్ట్ ని కూడా పరిచయం చేయబోతున్నారు మేకర్స్. కాగా ఈ టీజర్ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, సాయి ధరమ్.. టైటిల్ రిలీజ్ ఈవెంట్ లో తారక్ పై కామెంట్స్ చేశాడు.

Sai Dharam Tej : నీ స్నేహం నాతో ఇలానే ఉండాలి.. ఎన్టీఆర్‌పై సాయి‌ధరమ్ కామెంట్స్!

Sai Dharam Tej comments on ntr

Sai Dharam Tej : ఎట్టకేలకు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన సినిమా నుంచి అప్డేట్ ఇచ్చేశాడు. ఈ హీరో నుండి ఒక సినిమా అప్డేట్ వచ్చి దాదాపు ఏడాదిన్నర కాలం అయ్యిపోయింది. తాజాగా తన 15వ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ వీడియో గ్లింప్స్ ని విడుదల చేశాడు. లేట్ గా వచ్చిన లేటెస్ట్ వస్తాను అన్నట్టే ఉంది టైటిల్ టీజర్ కూడా. అదిరిపోయే విజువల్స్ తో ఆకట్టుకోవడమే కాదు, కొత్త కాన్సెప్ట్ ని కూడా పరిచయం చేయబోతున్నారు మేకర్స్.

Virupaksha : అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం.. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో సాయి ధరమ్ ‘విరూపాక్ష’ ట్రైలర్ అదుర్స్..

‘విరూపాక్ష’ అనే టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ థ్రిల్లర్ కథాంశంతో వస్తుంది. కాగా ఈ టీజర్ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, సాయి ధరమ్.. టైటిల్ రిలీజ్ ఈవెంట్ లో తారక్ పై కామెంట్స్ చేశాడు. “2007లో ఫస్ట్ టైమ్ నేను నిన్ను కలిసినప్పుడు నువ్వు నన్ను ఎలా రిసీవ్ చేసుకున్నావో, ఇప్పుడు కూడా అలానే ట్రీట్ చేశావు. వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు చాలా థాంక్యూ తారక్. ఎవరు ఏమనుకున్నా నీ స్నేహం ఎప్పటికి నాతో ఇలానే ఉండాలి” అంటూ వ్యాఖ్యానించాడు.

ఇక ఈ సినిమాకు టాలీవుడ్ లెక్కల మాస్టర్ కథని అందిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ గురించి మాట్లాడుతూ.. “లవ్ స్టోరీనో – యాక్షన్ స్టోరీనో ఇస్తాడు అనుకుంటే ఇలా థ్రిల్లర్ స్టోరీ ఇచ్చాడు” వ్యాఖ్యానించాడు. కాగా ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. బీవీఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.