Sai Pallavi: అప్పుడే పెళ్లి ఎంటండి బాబు.. నాకింకా 29 ఏళ్లే!

టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ సాయి పల్లవి వరుస సినిమాలతో దూసుకుపోతోంది. సినిమాల విషయంలో సెలెక్టెడ్ గా ఉండే సాయి పల్లవి ఇటు తెలుగులో ఇంతమంది గ్లామర్ డాల్స్ ఉన్నా తన..

Sai Pallavi: అప్పుడే పెళ్లి ఎంటండి బాబు.. నాకింకా 29 ఏళ్లే!

Sai Pallavi (1)

Sai Pallavi: టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ సాయి పల్లవి వరుస సినిమాలతో దూసుకుపోతోంది. సినిమాల విషయంలో సెలెక్టెడ్ గా ఉండే సాయి పల్లవి ఇటు తెలుగులో ఇంతమంది గ్లామర్ డాల్స్ ఉన్నా తన యాక్టింగ్ తో, పవర్ ఫుల్ పర్ ఫామెన్స్ తో, ఎలిగెన్స్ తో మల్టిపుల్ సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. తమిళ్ అమ్మాయి అయినా అచ్చతెలుగమ్మాయిలా తెలుగులో మాట్లాడుతూ టాలీవుడ్ కి మరింత దగ్గరైపోయింది టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి.

Young Hero’s: మారుతున్న ట్రెండ్.. స్టార్ హీరోల సినిమాలలో యంగ్ హీరోలు!

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కథ నచ్చితేనే సినిమాకి ఓకే చెప్పే సాయిపల్లవి.. ఈ గ్లామర్ ఫీల్డ్ లో తనదైన స్టైల్లో ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతోంది. గ్లామర్‌కు పాత్రలకు నో చెబుతూనే తన సహజమైన నటన, అదిరిపోయే డ్యాన్స్‌తో ఇటూ ప్రేక్షకులను, అటూ దర్శక-నిర్మాతలను ఫిదా చేస్తుంది ఈ బ్యూటీ. ఇక ఏ విషయంపై కూడా ముక్కుసూటిగా స్పందించే సాయి పల్లవి తన పెళ్లిపై కూడా అదే తీరుతో వ్యవహరించింది. ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సక్సెస్ జోష్ లో ఉన్న సాయిపల్లవి ఇంటర్వ్యూలు, చిట్ చాట్ లతో ఫుల్ బిజీగా ఉంది.

RRR Postpone: ఫ్యాన్స్ డిసప్పాయింట్.. డిప్రెషన్‌లో ఆర్ఆర్ఆర్ టీమ్?

కాగా, తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సాయి పల్లవికి తన పెళ్లి ఎప్పుడనే ప్రశ్న ఎదురైంది. ‘నాకు అప్పుడే పెళ్లి ఎంటండి బాబు.. నాకు ఇంకా 29 ఏళ్లు మాత్రమే. 30 ఏళ్లు వచ్చాక అప్పుడు పెళ్లి గురించి ఆలోస్తా’ అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చింది. ఇక, సాయిపల్లవి సినిమాల విషయానికి వస్తే తెలుగులో రానాతో కలిసి నటించిన విరాట పర్వం సినిమా విడుదల కావాల్సి ఉంది.