Salaar: వండర్స్ క్రియేట్ చేసేందుకు రెడీ అయిన సలార్ అల్టిమేట్ సీక్వెన్స్.. ఏమిటంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీలోని ఇంటర్వెల్ సీక్వెన్స్ అల్టిమేట్ గా ఉండబోతుందని.. ఇది వండర్స్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Salaar: వండర్స్ క్రియేట్ చేసేందుకు రెడీ అయిన సలార్ అల్టిమేట్ సీక్వెన్స్.. ఏమిటంటే?

Salaar Interval Sequence To Create Wonders Says Makers

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్‌గా ఈ మూవీని చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ భరతం పట్టేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు. ఈ మూవీలో ఆయన పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడట డైరెక్టర్.

Salaar: అక్కడ బ్రేక్ ఈవెన్ రావాలంటే ‘సలార్’ ఎంత కలెక్ట్ చేయాలో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

ఈ సినిమాలోని పలు సీక్వెన్స్‌లు ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మూవీలోని ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం నెవర్ బిఫోర్‌గా రానున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సీక్వెన్స్‌లో రివీల్ అయ్యే పలు విషయాలు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇవ్వనున్నాయట. ముఖ్యంగా ఈ ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ప్రభాస్ రెండో క్యారెక్టర్ రివీల్ అయ్యే విధానం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయని.. వారు ఈ ఎలివేషన్, ఇంట్రొడక్షన్‌ను ఎప్పటికీ మర్చిపోరని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Salaar: సర్‌ప్రైజ్‌ను సిద్ధం చేస్తోన్న సలార్.. ఎప్పుడొస్తుందంటే..?

ఒకవేళ ఇదే గనక నిజమైతే, ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్‌తో సలార్ సినిమా వండర్స్ క్రియేట్ చేయడం ఖాయమని పలువురు కామెంట్ చేస్తున్నారు. పూర్తిగా గ్రే షేడ్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సలార్ పాత్రలో ప్రభాస్ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అందాల భామ శ్రుతి హాసన్ ఈ సినిమాలో ఆద్య అనే పాత్రలో నటిస్తోండగా, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తోన్న సలార్ చిత్రాన్ని సెప్టెంబర్‌లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది.