సల్మాన్ ఖాన్ భారత్- టీజర్ రిలీజ్

సల్మాన్ ఖాన్ భారత్- టీజర్ రిలీజ్

  • Published By: sekhar ,Published On : January 25, 2019 / 07:05 AM IST
సల్మాన్ ఖాన్ భారత్- టీజర్ రిలీజ్

సల్మాన్ ఖాన్ భారత్- టీజర్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ జంటగా, అతుల్ అగ్నిహోత్రి, అల్విర ఖాన్ అగ్నిహోత్రి, భూషణ్ కుమార్ అండ్ కృష్ణ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ, భారత్..
ఇంతకుముందు సల్మాన్‌తో సుల్తాన్, టైగర్ జిందాహై సినిమాలు చేసిన అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న భారత్ మూవీ టీజర్ రీసెంట్‌గా రిలీజ్ చేసారు మేకర్స్. టీజర్‌లో, ఎప్పటిలానే తన స్టైల్ యాక్టింగ్‌తో అలరించాడు సల్లూ భాయ్. తన తండ్రి తనకి భారత్ అనే పేరు ఎందుకు పెట్టాడో వాయిస్ ఓవర్ ద్వారా చెప్తూ, సల్మాన్ తనని తను ఆడియన్స్‌‌కి ఇంట్రడ్యూస్ చేసుకోవడంతో మొదలైన భారత్ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

ఇండియా, పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్‌లో కథ జరుగుతుందని అర్థం అవుతుంది. సల్మాన్ చేసిన బైక్ స్టంట్ బాగుంది. విశాల్-శేఖర్ ఆర్ఆర్, మార్కిన్ కెమెరా వర్క్ కూడా బాగుంది. 2019 ఈద్ కానుకగా భారత్ రిలీజ్ కానుంది. టబు, జాకీ ష్రాఫ్, దిశా పటానీ, సోనాలీ కులకర్ణి, సునీల్ గ్రోవర్, నోరా ఫతేహి తదితరులు నటిస్తున్న 
ఈ సినిమాకి సమర్పణ : టీ సిరీస్, గుల్షన్ కుమార్, నిర్మాణం : సల్మాన్ ఖాన్ ఫిలింస్ అండ్ రీల్ లైఫ్ ప్రొడక్షన్ ప్రై.లి.            

వాచ్ భారత్ టీజర్…