Salman Khan : చిరంజీవి, వెంకటేష్ సినిమాల్లో నటించబోతున్నాను : సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్ తాజా సినిమా 'అంతిమ్' ఇటీవల రిలీజ్ అయింది. నిన్న హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం థ్యాంక్స్‌ మీట్‌ కు సల్మాన్ ఖాన్ విచ్చేసి మీడియాతో.......

Salman Khan : చిరంజీవి, వెంకటేష్ సినిమాల్లో నటించబోతున్నాను : సల్మాన్ ఖాన్

Salman

Salman Khan :  బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజా సినిమా ‘అంతిమ్’ ఇటీవల రిలీజ్ అయింది. నిన్న హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం థ్యాంక్స్‌ మీట్‌ కు సల్మాన్ ఖాన్ విచ్చేసి మీడియాతో మాట్లాడారు. ఈ థ్యాంక్స్‌ మీట్‌లో సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ… ‘‘నా సినిమా రిలీజ్‌కు ముందే ఇండియాలోని ప్రధాన నగరాలకు వెళ్లి ప్రమోషన్స్‌ చేయడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం చేస్తుంటాను. ‘టైగర్‌ 3’ షూటింగ్‌ వల్ల బిజీగా ఉండి వేరే నగరాల్లో ‘అంతిమ్’ సినిమాకి ప్రమోషన్ చేయలేదు. ‘అంతిమ్‌’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. హైదరాబాద్‌లో నన్ను ఆదరిస్తున్న నా ఫ్యాన్స్‌కు, ప్రేక్షకులకు థ్యాంక్స్‌ చెప్పేందుకే ఇవాళ వచ్చాను అని తెలిపారు.

Bigg Boss 5 : ప్రియాంక వల్ల బెడ్‌కే పరిమితమైన శ్రీరామ్.. హౌస్‌లో ఉంటాడా??

నా ‘దబాంగ్‌’ సినిమాను తెలుగులో డబ్‌ చేసి, విడుదల చేశాం. అది భారీ విజయం సాధించింది. కోవిడ్‌ వల్ల ‘అంతిమ్‌’కు టైమ్‌ లేక తెలుగులో డబ్‌ చేయలేదు. నా తదుపరి చిత్రాల్ని హిందీతో పాటు కచ్చితంగా తెలుగులో కూడా విడుదల చేస్తాను అని అన్నారు. ఇక తెలుగు సినిమాల గురించి మాట్లాడుతూ.. చిరంజీవి గారు, రామ్‌చరణ్‌లు నాకు మంచి స్నేహితులు. వెంకటేశ్‌ గారు కూడా బాగా తెలుసు. త్వరలో నేను నేరుగా తెలుగులో నటించబోతున్నాను. ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రంలో చేయమని చిరంజీవిగారు అడిగారు. పాత్ర ఏంటి? ఎన్ని రోజులు షూటింగ్‌? ఇవేమి అడగకుండానే సరే అన్నాను. వెంకటేశ్‌ గారితో కూడా త్వరలో నటించబోతున్నాను అని ఈ బాలీవుడ్‌ హీరో మీడియాతో తెలిపారు.

Allu Arjun : ఏపీ వరద భాదితులకు అల్లు అర్జున్ సాయం

దీంతో చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో సల్మాన్ స్పెషల్ పాత్ర చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే వెంకటేష్ తో ఏ సినిమాలో నటిస్తున్నాడో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ త్వరలో వెంకటేష్ తో కూడా సల్మాన్ కలిసి నటించబోతున్నాడు.