Suriya : సూర్యకు బెదిరింపులు.. సూర్య ఇంటి వద్ద భద్రత

ఇంతటితో ఆగకుండా సూర్యని కొడితే లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత సూర్యకు అనేక బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయనకు పోలీసులు భద్రతను కల్పించారు. ప్రస్తుతం తమిళనాడు, టి నగర్‌లో

Suriya : సూర్యకు బెదిరింపులు.. సూర్య ఇంటి వద్ద భద్రత

Suriya

Suriya :  ఒకపక్క కమర్షియల్ సినిమాలు చేస్తూ, మరో పక్క కంటెంట్ సినిమాలు కూడా చేస్తున్నాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. ఇటీవల దీపావళికి ‘జై భీమ్’ అంటూ మరో కొత్త కథతో వచ్చాడు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదల అయింది. ‘జై భీమ్’ సినిమాకి ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన లభించింది. మాములు ప్రేక్షకులు, అభిమానులు, సెలబ్రిటీలు సైతం ఈ సినిమాని, సినిమాలో నటి నటుల అద్భుతమైన నటనని అభినందిస్తున్నారు.

Puneeth Rajkumar : పునీత్‌కు నివాళి .. విజయోత్సవ సభలు జరిగిన చోటే సంస్మరణ సభ

అయితే ఒక పక్క మంచి ఆదరణ లభిస్తున్నా కొంతమంది ఈ సినిమాని వివాదాల్లోకి లాగుతున్నారు. ఇందులో కొన్ని సీన్స్ ని చూపించి సినిమాపై నెగిటివ్ కామెన్స్ చేస్తున్నారు. సినిమాలో ఓ సన్నివేశంలో ప్రకాష్ రాజ్ ఓ వ్యక్తిని హిందీలో మాట్లాడినందుకు కొడతాడు. దీన్ని వివాదంగా మర్చి ప్రకాష్ రాజ్ పై , డైరెక్టర్ పై విమర్శలు చేశారు. తాజాగా ఈ సినిమాలో వన్నియార్ లను అవమానించారంటూ ఆ సంఘం ఆరోపణలు చేస్తుంది.

Chiranjeevi : ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం మర్చిపోయాయి : చిరంజీవి

‘జై భీమ్’ చిత్రంలో మతపరమైన చిహ్నాన్ని కలిగి ఉన్న సన్నివేశంపై వన్నియార్ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘జై భీమ్’ చిత్ర నిర్మాత, దర్శకుడు, హీరో సూర్య పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీఎంకె మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్‌ సెల్వం అక్కడి పోలీసులకు వినతిపత్రం ఇచ్చారు. నవంబర్ 15న వన్నియార్ సంఘం ప్రతిష్టను దిగజార్చారు అంటూ సూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు వన్నియార్ సంఘం లీగల్ నోటీసు పంపింది.

Chaurasia : నటి చౌరాసియా పై దాడిలో నిందితుడి వేలిముద్రలు లభ్యం..

అయితే వీటిపై సూర్య క్లారిటీ కూడా ఇచ్చాడు. మేము ఎవరిని కించపరచలేదని, సినిమాని సినిమాలాగే చూడాలని చెప్పాడు. కానీ ఇంతటితో ఆగకుండా సూర్యని కొడితే లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత సూర్యకు అనేక బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయనకు పోలీసులు భద్రతను కల్పించారు. ప్రస్తుతం తమిళనాడు, టి నగర్‌లోని సూర్య నివాసం వద్ద పోలీసులు భద్రతను ఇస్తున్నారు.