Chaurasia : నటి చౌరాసియా పై దాడిలో నిందితుడి వేలిముద్రలు లభ్యం..

ఈ కేసులో పోలీసులకు కొన్ని ఆధారాలు దొరికాయి. ఐ ఫోన్ చోరీ చేసిన అనంతరం దుండగుడు అపోలో ఆసుపత్రి దగ్గర ఓ హోటల్ సమీపంలో ఐ ఫోన్ మొబైల్ పౌచ్ పడేసి అక్కడినుండి వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ లో

Chaurasia : నటి చౌరాసియా పై దాడిలో నిందితుడి వేలిముద్రలు లభ్యం..

Chaurasiya

Chaurasia :  రెండు రోజుల క్రితం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద సోషల్ మీడియా స్టార్, నటి చౌరాసియాపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పార్క్ దగ్గర చౌరాసియా వాకింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి ఆమె సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో ఆమెకు గాయాలయ్యాయి. ఆ తర్వాత చౌరాసియా 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది.

Bigg Boss 5 : నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు.. వెళ్ళిపో.. సిరిపై సీరియస్ అయిన ష‌ణ్ను

పోలీసులు ఈ కేసుని చాలా వేగంగా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ కేసులో పోలీసులకు కొన్ని ఆధారాలు దొరికాయి. ఐ ఫోన్ చోరీ చేసిన అనంతరం దుండగుడు అపోలో ఆసుపత్రి దగ్గర ఓ హోటల్ సమీపంలో ఐ ఫోన్ మొబైల్ పౌచ్ పడేసి అక్కడినుండి వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ లో కనపడింది. ఆ ఐ ఫోన్ పౌచ్ ని పోలీసులు గుర్తించారు. లభ్యమైన ఐ ఫోన్ పౌచ్ ని చౌరాసియాకు చూపించగా ఆ పౌచ్ తనదే అని పోలీసులకు తెలిపింది. దానిపై నిందితుడి ఫింగర్ ప్రింట్స్ ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఆ ఫింగర్ ప్రింట్స్ ని కలెక్ట్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. ఐ ఫోన్ పై లభ్యమైన ఫింగర్ ప్రింట్స్ పాత నేరస్తులతో మ్యాచ్ కాకపోవడంతో చౌరాసియా ఐఫోన్ దొంగిలించిన నిందితుడు కొత్త వాడేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

Bigg Boss 5 : యాని మాస్టర్‌కి సపోర్ట్‌గా మోనాల్.. ఆమె గురించి నాకు తెలుసు

ఆ తర్వాత మరోసారి సిసిటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. నిందితుడు కె.బీ.ఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో వైట్ షూస్ వేసుకొని సంచరించినట్లు తెలిసింది. నటి చౌరాసియాపై దాడి జరిగిన తర్వాత సెల్ ఫోన్ తో కెబిఆర్ పార్క్ నుండి అపోలో ఆసుపత్రి వైపు పరిగెత్తినట్లు సీసీ ఫుటేజ్ ని గుర్తించారు పోలీసులు. ఐ ఫోన్ 8 ప్లస్ సిరీస్ కావడంతో నిందితుడు ఫోన్ ని స్విచ్ ఆఫ్ & ఆపరేట్ చేయలేకపోతున్నట్టు తెలుస్తుంది. పోలీసులు చౌరాసియా మొబైల్ నంబర్ కు తరుచూ కాల్స్ చేస్తుండగా నిందితుడు కాల్స్ కట్ చేస్తున్నాడు. కాల్స్ చేస్తూ లొకేషన్ ని ట్రేస్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారు పోలీసులు.

Raghava Lawrence : రియల్ సినతల్లి ఆశీర్వాదం తీసుకున్న లారెన్స్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు

చోరీ జరిగిన సమయంలో ఆంధ్ర స్లాంగ్ లో నిందితుడు మాట్లాడినట్లు పోలీసులకు చౌరాసియా తెలిపింది. దీంతో నిందితుడు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాడిగా అంచనా వేశారు. సీసీ కెమెరాల్లో నిందితుడి ఫేస్ క్లియర్ గా క్యాప్చర్ కాకపోవడంతో వివిధ కోణాల్లో సీసీ కెమెరాల నుంచి అన్వేషిస్తున్నారు. నిందితుడు వేసుకున్న దుస్తులు, వైట్ షూస్ ఆధారంగా అతన్ని పట్టికోవడానికి ట్రై చేస్తూ కేసుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు నటితో చెప్పినట్టు సమాచారం.