RC 15 : పోస్టర్ అంత కాస్టా.. శంకర్ సినిమా అంటే అంతే మరి..!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ కాంబోలో రాబోతున్న RC 15 ఫస్ట్ పోస్టర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..

RC 15 : పోస్టర్ అంత కాస్టా.. శంకర్ సినిమా అంటే అంతే మరి..!

Rc 15 Poster

RC 15: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ కాంబోలో రానున్న RC 15 సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే.. మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి, బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరై, మూవీ టీంకి విషెస్ తెలియజేశారు.

Ram Charan : రామ్ చరణ్ వాచ్ అదిరింది.. కాస్ట్ ఎంతో తెలుసా..!

సినిమా ఓపెనింగ్ రోజు వుయ్ ఆర్ కమింగ్ అంటూ ఆర్టిస్టులు, టెక్నీషిన్లు అందరూ సూట్స్ వేసుకుని పోస్టర్ రిలీజ్ చెయ్యగా బాగా వైరల్ అయ్యింది. ఈ పోస్టర్లో దర్శకుడు శంకర్, రామ్ చరణ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిర్మాతలు శిరీష్ – దిల్ రాజులతో సహా పలువురు నటీనటులు ఉన్నారు. పోస్టర్ డిఫరెంట్‌గా డిజైన్ చేసి ఓపెనింగ్ రోజే మాంచి కిక్ ఇచ్చారు టీం.

Ram Charan New Car : మెగా పవర్‌స్టార్.. కొత్త కార్ చూశారా..!

ఇప్పుడీ పోస్టర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిశాయి. సాధారణంగా శంకర్ సినిమాలంటేనే భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో ఉంటాయి. కేవలం ఒక పాటకే కోట్లాది రూపాయలు వెచ్చిస్తారాయన. RC 15 పోస్టర్ కోసం రూ. 1.2 కోట్లు ఖర్చు పెట్టారట. ఒక్క పోస్టర్‌కే ఇంతలా ఖర్చు పెట్టారంటే ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోండి అంటున్నారు మెగా ఫ్యాన్స్.

Ram Charan : మెగా పవర్‌స్టార్.. వెయ్యి కోట్ల హీరో..