Bigg Boss 5 : సన్నీతో పాటు షణ్ముఖ్‌కి కూడా ప్లాట్

ఇక నిన్న బిగ్ బాస్ విన్నర్ ప్రకటించిన తర్వాత ఎప్పటిలాగే కూల్ గా ఉన్నాడు. స్టేజిపై షణ్ముఖ్ మాట్లాడుతూ.. గెలిచామా? లేదా అన్నది కాదు, ఎలా ఆడామన్నది ముఖ్యం. ఇప్పుడు కాకపోతే.......

Bigg Boss 5 : సన్నీతో పాటు షణ్ముఖ్‌కి కూడా ప్లాట్

Shanmukh

Bigg Boss 5 :   బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ లో సన్నీ విన్నర్ గా గెలిచాడు. అయితే ముందు నుంచి అందరూ షణ్ముఖ్ గెలుస్తాడు అనుకున్నా సన్నీ సోషల్ మీడియా ప్రమోషన్స్ తో, తన యారోగెంట్ పర్ఫార్మెన్స్ తో ఇప్పటి యూత్ ని కనెక్ట్ చేసుకొని విన్నర్ గా గెలిచాడు.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ, వెబ్ సిరీస్ లతో ఎదిగి తెలుగులోనే ఎక్కువ సబ్ స్క్రయిబర్స్ ఉన్న ఫస్ట్ యూట్యూబర్ గా షణ్ముఖ్ ఎప్పుడో రికార్డు సృష్టించాడు. యూట్యూబ్ నుంచి డైరెక్ట్ గా బిగ్ బాస్ కి అర్హత సాధించాడు. ముందు నుంచి చాలా కూల్ గా ఉంటూ ఎవరి గురించి ఆలోచించకుండా తన పని తానూ చేసుకుంటూ వెళ్ళాడు. తన ఫాలోవర్స్ తో ఓట్లు పడినా విజయానికి ఒక స్టెప్ దూరంలో నిలిచి అందరి హృదయాల్ని గెలుచుకున్నాడు. విన్నర్ సన్నీనే నువ్వు చాలామంది మనసులు గెలుచుకున్నావ్‌ షణ్నూ అని స్టేజి మీద చెప్పాడంటే అర్ధం చేసుకోవచ్చు.

Bigg Boss 5 : బిగ్‌బాస్‌ విన్నర్ సన్నీ ఏమేమి గెలిచుకున్నాడో తెలుసా…

ఇక నిన్న బిగ్ బాస్ విన్నర్ ప్రకటించిన తర్వాత ఎప్పటిలాగే కూల్ గా ఉన్నాడు. స్టేజిపై షణ్ముఖ్ మాట్లాడుతూ.. గెలిచామా? లేదా అన్నది కాదు, ఎలా ఆడామన్నది ముఖ్యం. ఇప్పుడు కాకపోతే తర్వాత ఎప్పుడైనా గెలవచ్చు అని అన్నాడు. ఇక బిగ్ బాస్ విన్నర్ కి ముందు చెప్పిన దాని ప్రకారమే బిగ్ బాస్ ట్రోఫీతో పాటు రూ.50 లక్షల చెక్‌ను అందచేశారు. దీనితో పాటు సువర్ణ భూమి ఇన్‌ఫ్రాస్టక్చర్‌ నుంచి షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల భూమిని, టీవీఎస్‌ బైక్‌ ని కూడా ఇచ్చారు.

RRR: ముంబైలో RRRటీంతో సల్మాన్ ఖాన్.. ఈ సీన్ మాత్రం అరుపులే..!

అయితే రన్నరప్ కి ముందు ఏమి ప్రకటించలేదు. కానీ నిన్న రన్నరప్ కి కూడా స్పెషల్ గిఫ్ట్ ని అనౌన్స్ చేశారు. విన్నర్‌కు ప్లాట్‌ ఇచ్చిన సువర్ణ కుటీర్‌ డెవలపర్స్‌ రన్నరప్‌ షణ్నుకు కూడా ప్లాట్‌ ఇస్తామని తెలిపారు. దీంతో సన్నీతో పాటు షణ్ముఖ్ కూడా ఫ్లాట్ గెలుచుకున్నాడు. అయితే మాములుగా బిగ్ బాస్ లో ఉన్నందుకు ఇచ్చే రెమ్యునరేషన్ ప్రకారం అయితే సన్నీ కంటే షణ్ముఖ్ ఎక్కువ సంపాదించినట్టు సమాచారం.