Bigg Boss 5 : సచ్చినోడా అంటూ షణ్నుని స్టేజిపైనే తిట్టేసిన దీప్తి..

మొన్నటి ఎపిసోడ్ లో షణ్ను కోసం వాళ్ళ మదర్ రాగా నిన్నటి ఎపిసోడ్ లో షణ్ను బ్రదర్ సంపత్ తో పాటు ప్రియురాలు దీప్తి కూడా వచ్చి షణ్నుకి షాకిచ్చింది. దీప్తిని చూడగానే షణ్ను...

Bigg Boss 5 : సచ్చినోడా అంటూ షణ్నుని స్టేజిపైనే తిట్టేసిన దీప్తి..

Shannu Deepthi

Bigg Boss 5 :  గత మూడు రోజులుగా బిగ్ బాస్ లో ఎమోషనల్ ఎపిసోడ్స్ నడుస్తున్నాయి. కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఫ్యామిలీలు హౌస్ లోకి వచ్చారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా ఎమోషనల్ అయ్యారు. నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో కూడా కంటెస్టెంట్స్ కి బాగా కావాల్సిన వాళ్ళు వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక మొన్నటి ఎపిసోడ్ లో షణ్ను కోసం వాళ్ళ మదర్ రాగా నిన్నటి ఎపిసోడ్ లో షణ్ను బ్రదర్ సంపత్ తో పాటు ప్రియురాలు దీప్తి కూడా వచ్చి షణ్నుకి షాకిచ్చింది.

Sreenu Vaitla : డైరెక్టర్ శ్రీనువైట్లకు పితృవియోగం.. సంతాపం తెలుపుతున్న సినీ ప్రముఖులు

అయితే కంటెస్టెంట్స్ వాళ్ళకి విలువైన వస్తువులని త్యాగం చేస్తేనే వారి కోసం స్పెషల్ పర్సన్స్ వస్తారని బిగ్ బాస్ చెప్పడంతో కంటెస్టెంట్స్ అంతా వారికి బాగా ఇష్టమైన వస్తువులని ఇచ్చేయడంతో వాళ్ళ కోసం స్పెషల్ పర్సన్స్ వచ్చారు. అందరూ వెళ్ళిపోయాక చివరగా షణ్ముఖ్‌.. తన ప్రేయసి దీప్తి సునయన ఇచ్చిన టీషర్ట్‌ను భారంగా త్యాగం చేశాడు. దీంతో షణ్ముఖ్ కోసం మొదట అన్నయ్య సంపత్‌ వచ్చాడు. సంపత్ నా కోసం కాకుండా ఇంకా ఎవరో వస్తారు అనుకుంటున్నట్టు ఉన్నావ్ అని షణ్నుతో అన్నాడు. దీపు వస్తుంది అనుకున్న అంటే రాకపోతే నన్నేమి చేయమంటావ్ అని నాగార్జున అన్నాడు.

Suresh Babu : ఏపీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల థియేటర్స్ కంటే ఓటిటినే సేఫ్ అంటున్న స్టార్ ప్రొడ్యూసర్

కానీ అంతలోనే దీప్తి సునైనా స్టేజిపైకి వచ్చింది. దీప్తిని చూడగానే షణ్ను ఎమోషనల్ అయి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇద్దరూ కాసేపు అలా చూసుకున్నారు. ఒకర్నొకరు వాళ్ళ ముద్దు పేర్లతో పిలిచుకున్నారు. మిస్ యు చెప్పుకున్నారు. సచ్చినోడా అంటూ క్యూట్ గా ప్రేమతో తిట్టింది దీప్తి. ఆ తర్వాత నీ ఎమోషన్స్‌ను స్ట్రెంత్‌గా మార్చుకో కానీ వీక్‌ అయిపోవద్దని చెప్పింది. నువ్వేంటో నాకు తెలుసంటూ గాల్లో ముద్దులు పంపించింది. ఫైనల్ లో కలుద్దామంటూ వెళ్ళిపోయింది దీప్తి. మరోసారి వీళ్లిద్దరి మధ్య ఉన్న ప్రేమని బిగ్ బాస్ ద్వారా ఇలా బయట పెట్టారు షణ్నుదీప్తి.