బాలు స్పృహలోకి వచ్చారు.. తాజా హెల్త్ బులెటిన్ విడుదల..

  • Published By: sekhar ,Published On : August 26, 2020 / 07:25 PM IST
బాలు స్పృహలోకి వచ్చారు.. తాజా హెల్త్ బులెటిన్ విడుదల..

SPB Health Condition: ప్రపంచవ్యాప్తంగా గాన గంధర్వుడు ఎస్.పి. బాలు కోసం చేసిన పూజలు ఫలించాయి. ప్రస్తుతం బాలు కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎంజీఎం హాస్పిటల్‌ వర్గాలు తాజాగా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశాయి. చికిత్సకు బాలు బాగా స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.

బాలు స్పృహలోకి వచ్చారని, ఆయన శ్వాస ప్రక్రియ బాగా మెరుగైందని వెల్లడించారు. ఇలాగే నిలకడగా ఉంటే మరో వారం రోజుల్లో ఎక్మో పరికరాన్ని తొలగించే వీలుందని తెలిపారు.

ఇక, బాలు చికిత్స పొందుతున్న అత్యవసర విభాగం దిగువ అంతస్థులో ప్రతి రోజూ వేద పండితులు వేదపారాయణం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని బాలు చికిత్స పొందుతున్న గదిలో ఉన్న టీవీ తెరపై ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.
బాలు ఆరోగ్యం పరిస్థితి గురించి ఆయన తనయుడు చరణ్ వీడియో విడుదల చేశారు.