BiggBoss Siri : సిరిని అర్ధం చేసుకోవడం చాలా కష్టం.. సపోర్ట్ తీసుకోదు.. ప్రియుడి వ్యాఖ్యలు..

తాజాగా యాంకర్ రవి గత సీజన్ కంటెస్టెంట్స్ లో ప్రియాంక, ప్రియ, సిరితో ఓ ఫన్నీ ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూ ప్రోమోని రిలీజ్ చేయగా......................

BiggBoss Siri :  సిరిని అర్ధం చేసుకోవడం చాలా కష్టం.. సపోర్ట్ తీసుకోదు.. ప్రియుడి వ్యాఖ్యలు..

Siro

BiggBoss Siri :  గత సీజన్ బిగ్‌బాస్‌ లో ఆల్రెడీ ఫేమస్ అయిన కంటెస్టెంట్స్ షోతో మరింత ఫేమస్ సంపాదించారు. ఇక హౌస్ నుంచి బయటకి వచ్చాక కూడా వారంతా ఫ్రెండ్స్ గా ఉంటూ అప్పుడప్పుడు సరదాగా టైం స్పెండ్ చేస్తున్నారు. గత కంటెస్టెంట్స్ లో సిరి ఒకరు. సీరియల్స్, యాంకరింగ్ తో పేరు తెచ్చుకున్న సిరి బిగ్‌బాస్‌ వరకు వెళ్ళింది. ఇక సిరికి శ్రీహన్ అనే మరో ఆర్టిస్ట్ తో గతంలోనే ఎంగేజ్మెంట్ అయిపొయింది. బిగ్‌బాస్‌ తర్వాత షన్ను-దీప్తి విడిపోయినట్టు సిరి, శ్రీహాన్ కూడా విడిపోయారని వార్తలు వచ్చాయి. కానీ వాటన్నిటికి చెక్ పెడుతూ ఇటీవలే ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని పోస్ట్ చేసి శ్రీహన్ గురించి ఎమోషనల్ గా చెప్పింది.

తాజాగా యాంకర్ రవి గత సీజన్ కంటెస్టెంట్స్ లో ప్రియాంక, ప్రియ, సిరితో ఓ ఫన్నీ ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూ ప్రోమోని రిలీజ్ చేయగా ఇది ఆద్యంతం సరదాగా సాగింది. ఈ ఇంటర్వ్యూలో శ్రీహాన్ ఓ వీడియో మెసేజ్ పంపగా అది సిరికి చూపెట్టడంతో సిరి మరో సారి ఎమోషనల్ అయింది.

Richa Chadha : వారి వల్లే బాలీవుడ్‌కి నష్టాలు.. సౌత్‌లో అలా ఉండదు..

 

ఈ వీడియోలో శ్రీహన్ మాట్లాడుతూ.. ”సిరిని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. నేను ఇప్పటికి అర్ధం చేసుకోడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. సిరి ఏదైనా సాధించాలనుకుంటే ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా ట్రై చేస్తుంది. తను వైజాగ్‌లో ఉన్నప్పుడు హైదరాబాద్‌ వచ్చి సాధించాలి అనుకుంది. యాంకరింగ్‌ చేసుకుంటూ సీరియల్స్‌, సీరియల్స్‌ నుంచి సినిమాలు, సినిమాల నుంచి మొన్నటి బిగ్‌బాస్‌ వరకు ఇలా తను ఏం సాధించినా మొత్తం తన కష్టమే. ఎవ్వరూ సహాయం చేయలేదు. తను కూడా ఎవ్వరి సపోర్ట్ తీసుకోదు. కానీ సిరి గురించి ఎంత చెప్పినా తనని అర్ధం చేసుకోవడం మాత్రం చాలా కష్టం” అని చెప్పుకొచ్చాడు.