Star Actress: ఈడా ఉంటాం.. ఆడా ఉంటాం.. ఎక్కడైనా ఒకే అంటున్న స్టార్ బ్యూటీస్!

దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టాలనుకునేది రష్మిక, పూజాల మాస్టర్ ప్లాన్. వీళ్లే ఇలా ఉంటే వీళ్ల సీనియర్స్ ఊరుకుంటారా... మేమేం తక్కువ తినలేదని ప్రూవ్ చేసుకుంటున్నారు.

10TV Telugu News

Star Actress: దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టాలనుకునేది రష్మిక, పూజాల మాస్టర్ ప్లాన్. వీళ్లే ఇలా ఉంటే వీళ్ల సీనియర్స్ ఊరుకుంటారా… మేమేం తక్కువ తినలేదని ప్రూవ్ చేసుకుంటున్నారు. యంగ్ స్టర్ తో పోటీపడి మరి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లలో పాగా వేస్తున్నారు. నయన్ నుంచి మొదలెడితే రకుల్ వరకు ఇప్పుడిదే తంతు.

Allu Arjun: బాలీవుడ్ స్టార్‌తో ఐకాన్ స్టార్ మల్టీస్టారర్?

లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ రేంజ్ కూడా పెరుగుతూనే ఉంది. యంగ్ బ్యూటీస్ ను తలదన్నేలా ఆఫర్స్ కొల్లగొడుతూనే ఉంది. తమిళ్ ఇండస్ట్రీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే నయన్.. మంచి ఆఫర్స్ వస్తే తెలుగు, మలయాళ సినిమాలు చేస్తుంటుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో కాదు వాకుల రెండు కాదల్, కనెక్ట్ ప్రాజెక్ట్స్ తో పాటూ జి.ఎస్.విక్నేశ్ కాంబోలో మరో ఫిల్మ్ చేస్తోంది. టాలీవుడ్ లో మెగాస్టార్ గాడ్ ఫాదర్ లో పవర్ఫుల్ క్యారెక్టర్ కి కమిటైంది. ఇక ఇన్నాళ్లకు బాలీవుడ్ డెబ్యూ ఇస్తోన్న నయన్.. పట్టడమే షారుఖ్ సినిమాను పట్టేసింది. అట్లీ డైరెక్ట్ చేస్తోన్న సినిమాలో షారుఖ్ జంటగా ఈ సీనియర్ అందగత్తె నటిస్తోంది. వీటితో పాటూ నిర్మాతగా, విఘ్నేశ్ శివన్ లవర్ గా ఎప్పుడూ మూడు ఇండస్ట్రీలు మాట్లాడుకునేలా చేయడం నయన్ హాబీ.

Bollywood Hero’s: 30@ఇండస్ట్రీ.. మూడు స్టెప్పులు దాటేసిన బాలీవుడ్ హీరోలు!

సమంతా కూడా విడాకుల తర్వాత జోష్ పెంచింది. మంచి ఆఫర్ ఎక్కడి నుంచి వస్తోన్న క్యాచ్ చేస్తోంది. ప్రజెంట్ సామ్ బుట్టలో తెలుగు, తమిళ్, హిందీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవీ మాక్సిమమ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అవ్వడం మరో స్పెషల్. తెలుగులో శాకుంతలం కంప్లీట్ చేసిన సమంతా.. పుష్పలో ఐటమ్ సాంగ్ చేస్తోంది. తమిళ్ లో కాదు వాకుల రెండు కాదల్ మూవీలో నయన్ తో కలిసి కనిపించబోతుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్చ్ తో పాటూ శ్రీదేవి మూవీస్ తో బైలింగ్వవల్ ప్రాజెక్ట్స్ కు సైన్ చేసింది. ఫ్యామిలీ మ్యాన్ తర్వాత పెరిగిన క్రేజ్ తో బాలీవుడ్ కథలని వింటోన్న సామ్.. త్వరలోనే దానికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పబోతుంది.

Telugu Heroin’s: ఎక్కడ ఆఫర్ వస్తే.. అక్కడ వాలిపోతున్న హీరోయిన్లు!

సౌత్ నుంచే వెళ్లిన తాప్సీ.. బాలీవుడ్ సినిమాలతో దూసుకుపోతుంది. అప్పుడప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ఆడియెన్స్ ను పలకరిస్తోంది. బ్లర్, లూప్ లపేటా, దో బారా, శభాష్ మిథూ, వో లడకీ హై కహాన్ వంటి సూపర్ ప్రాజెక్ట్స్ తో బాలీవుడ్ లో బిజీగా ఉంది తాప్సీ. తెలుగులో మిషన్ ఇంపాజిబుల్ చేస్తోన్న ఆమె తమిళ్ లో జనగణమన, అలియెన్ సినిమాల్లో నటిస్తోంది. ఇలా మూడు భాషల్లో ఎక్కువగా హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు చేసే అవకాశాలు కేవలం తాప్సీకి మాత్రమే దక్కుతున్నాయి.

Peddanna: సందడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన రజనీకాంత్!

సైలెంట్ గా రకుల్ కూడా సౌత్ టు నార్త్ పని కానిచ్చేస్తోంది. బాలీవుడ్ లో జాన్ అబ్రహం అటాక్, అక్షయ్ కుమార్ సిండ్రిల్లా, అజయ్ దేవగణ్ మేడే, థాంక్ గాడ్, ఆయుష్మాన్ డాక్టర్ జీతో పాటూ ఫన్నీ మూవీ ఛత్రీవాలీ సినిమాలతో అక్కడ తీరిక లేకుండా గడుపుతోంది. తెలుగు, తమిళ్ లో అవకాశాలొస్తే వాటిని వదులుకోవట్లేదు. ఇక రాశిఖన్నా అలాగే తయారైంది. షాహిద్ కపూర్ తో రాజ్ అండ్ డికే వెబ్ సిరీస్ చేస్తోన్న రాశీ.. సిద్ధార్ధ్ మల్హోత్రా యోధ, అజయ్ దేవగణ్ రుద్ర ప్రాజెక్టుల్లో లీడ్ రోల్స్ చేస్తోంది. తెలుగులో పక్కా కమర్షియల్, థాంక్యూ సినిమాల్లో కనిపించనుంది. తమిళ్ లో ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తోన్న రాశీ.. ఛాన్స్ వచ్చినప్పుడల్లా మలయాళంలో కూడా మెరుస్తోంది.