Star Heroin’s: హీరోలతో సమానంగా క్రేజ్.. లెక్క మార్చేస్తున్న హీరోయిన్స్!

హీరోయిన్లు మారిపోయారు.. హీరోల కోసం సినిమాలు చూసే ఆడియన్స్ కూడా మారిపోయారు. అప్ నా టైమ్ ఆయేగా అంటూ వెయిట్ చేసిన హీరోయిన్లు.. సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చూపిస్తున్నారు.

Star Heroin’s: హీరోలతో సమానంగా క్రేజ్.. లెక్క మార్చేస్తున్న హీరోయిన్స్!

Star Heroin's

Star Heroin’s: హీరోయిన్లు మారిపోయారు.. హీరోల కోసం సినిమాలు చూసే ఆడియన్స్ కూడా మారిపోయారు. అప్ నా టైమ్ ఆయేగా అంటూ వెయిట్ చేసిన హీరోయిన్లు.. సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చూపిస్తున్నారు. ఒకప్పుడు సినిమా రిలీజ్ అవుతుందంటే హీరో ఎవరని అడిగే జనాలు కాస్తా.. హీరోయిన్ కోసం కూడా ఆరా తీసి.. హీరోయిన్ కోసం సినిమాలు చేస్తున్నారు. మరి ఆడియన్స్ కి థియేటర్లకు రప్పిస్తున్న హీరోయిన్లెవరో చూద్దాం.

Omicron Effect on Films: కలెక్షన్ల డ్రాప్.. రిలీజైన సినిమాలకు ఓమిక్రాన్ కష్టాలు!

ఆడియన్స్ టేస్ట్ మారుతోంది. ఒకప్పుడు హీరోల కోసం థియేటర్లకెళ్లే జనాలు ఇప్పుడు హీరోయిన్ల కోసం కూడా క్యూలు కడుతున్నారు. హీరోల స్పేస్ లోకి వెళ్లిన ఆడియన్స్ ని తమవైపుకు లాగేసుకుంటున్నారు హీరోయిన్లు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ లో హీరో నాని అయినా.. హీరోయిన్ సాయిపల్లవి అంటే ఆ.. సినిమాకుండే వెయిట్ వేరే లెవల్లో ఉంటుంది. తన పవర్ ఫుల్ తయాక్టింగ్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే సాయిపల్లవి.. సింగిల్ గానే ఆడియన్స్ ని ధియేటర్లకు రప్పించగలిగింది.

Bigg Boss 5 Telugu: సిరి-షణ్నుల రిలేషన్‌.. విన్నర్ సన్నీ కామెంట్స్ వైరల్!

ప్రజెంట్ సినిమాల విషయంలో హీరోలకెంత క్రేజ్ ఉందో.. హీరోయిన్లకు కూడా అంతే క్రేజీ ఫాలోయింగ్ తో ఉన్నారు ఫాన్స్. రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప విషయంలో బన్నీతో పాటు విపరీతమైన క్రేజీని సంపాదించుకుంది రష్మిక. నేషనల్ క్రష్ గా పిలిపించుకుంటున్న రష్మిక.. పుష్ప తన యాక్టింగ్ తో, ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియన్స్ ని ధియేటర్లకు పుల్ చెయ్యగలిగింది.

Namratha – Upasana: క్రిస్‌మస్‌ సెలబ్రేషన్.. దుబాయ్‌లో ఉపాసన-నమ్రత!

ఇటు సౌత్ టూ నార్త్ షటిల్ సర్వీస్ చేస్తున్న పూజాహెగ్డే.. పర్ ఫామెన్స్ ఓరయంటెడ్ క్యారెక్టర్స్ చేస్తోంది. అందుకే సౌత్ లో స్టార్ హీరోలందరూ పూజతో స్క్రీన్ షేర్ చేస్కోవాలనుకుంటున్నారు. అటు గ్లామర్ రోల్ అయినా.. ఇటు ఇండెప్త్ పర్ ఫామెన్స్ ఇచ్చే రోల్ అయినా.. రెండిటికీ న్యాయం చెయ్యగల హీరోయిన్ పూజాహెగ్డే. అందుకే ఏరికోరి మరీ సినిమాలో చిన్న రోల్ అయినా పర్లేదని.. ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుందని.. సినిమాల్లో ఆఫర్లిస్తున్నారు మేకర్స్.

Tollywood Hero’s: కలిసి వస్తున్న తండ్రి కొడుకులు.. ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!

సీనియర్ హీరోయిన్ అయినా ఆడియన్స్ ని పుల్ చెయ్యగలిగిన హీరోయిన్ సమంత.. స్టోరీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న సమంత.. లేటెస్ట్ గా పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ఆడియన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చింది. అంతేకాదు.. బాలీవుడ్ ఫామిలీ మ్యాన్ లో మిగిలిన వాళ్లెంతమంది ఉన్నా.. సమంత స్పెషాలిటీనే వేరు. పుష్పలో కూడా అంతే.. చేసింది ఒక్క పాటే అయినా.. ఆ పాట కోసం ధియేటర్లకి వెళ్లిన వాళ్ల లిస్ట్ మాత్రం పెద్దదే. ఇలా హీరోలే కాకుండా తమకోసం ఆడియన్స్ కి ధియేటర్లకు రప్పించగలుగుతున్నారు హీరోయిన్స్.