Unstoppable 2 : మాస్ సినిమా, ఓటీటీ, ఐటం సాంగ్స్ పై అల్లు అరవింద్, సురేష్ బాబు కామెంట్స్..

బాలకృష్ణ పలు ప్రశ్నలు అడగగా గెస్టులు సమాధానాలు చెప్పారు. ఈ నేపథ్యంలో సినిమాలకి సంబంధించి కొన్ని పదాల గురించి అడిగి వాటి గురించి చెప్పామన్నారు. ముందుగా మాస్ సినిమా గురించి..............

Unstoppable 2 : మాస్ సినిమా, ఓటీటీ, ఐటం సాంగ్స్ పై అల్లు అరవింద్, సురేష్ బాబు కామెంట్స్..

star producers comments on maas movies and ott

Unstoppable 2 :  ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 గ్రాండ్ సక్సెస్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సీజన్ లో నాలుగు ఎపిసోడ్లు కాగా తాజాగా ఐదో ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఐదో ఎపిసోడ్ కి అగ్ర నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, అగ్ర దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి వచ్చారు. ఇటీవలే ఈ ప్రోమో రిలీజ్ చేయగా బాగా వైరల్ అవ్వడంతో ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. శుక్రవారం రాత్రి ఈ ఎపిసోడ్ ని ఆహాలో రిలీజ్ చేశారు.

ఇక ఈ ఎపిసోడ్ లో మొత్తం సినిమాల గురించే మాట్లాడారు. బాలకృష్ణ పలు ప్రశ్నలు అడగగా గెస్టులు సమాధానాలు చెప్పారు. ఈ నేపథ్యంలో సినిమాలకి సంబంధించి కొన్ని పదాల గురించి అడిగి వాటి గురించి చెప్పామన్నారు. ముందుగా మాస్ సినిమా గురించి అడిగారు బాలయ్య. సురేష్ బాబు.. మాస్ సినిమా అంటే పండగపూట కిక్కిచ్చే సినిమా, నిర్మాతలకి లైఫ్ లైన్ లాంటి సినిమా అని అన్నారు. అల్లు అరవింద్.. నా జీవితాన్ని నిలబెట్టింది మాస్ సినిమాలు అని చెప్పారు.

బాక్సాఫీస్, ఓటీటీ గురించి అడగగా సురేష్ బాబు.. ఇటీవల బాక్సాఫీస్ ఖాళీ అయిపోతుంది అని అంటున్నారు. బాక్సాఫీస్ ఎప్పటికి ఉంటుంది. ఓటీటీ దాన్ని ఖాళీ చేయదు. సినిమా చూసే విధానం మారుతుంది అంతే. దానికి మనం అలవాటు పడాలి. కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎప్పటికి ఉంటుంది. ఒకప్పుడు ఏపీలో 3000 థియేటర్స్ ఉండేవి ఇప్పుడు 1750 ఉన్నాయి. సీట్స్ కూడా తగ్గాయి. ఓటీటీ వల్ల జనాలు కూడా థియేటర్స్ కి రావడం తగ్గారు. కానీ బాక్సాఫీస్ కొన్ని సినిమాలకి కరెక్ట్ గా పని చేస్తుంది. పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు.. మీ అఖండ లాంటి సినిమాలకి బాక్సాఫీస్ పరిమితవుతుంది. దానికి ఢోకా లేదు కానీ చిన్న సినిమాలకి ఖాళీగానే ఉంటుంది అని అన్నారు. అల్లు అరవింద్.. సినిమా చూసే విధానం మారినా ఎంటర్టైన్మెంట్ మారదు. ఎక్కడ చూసినా జనాలకి ఎంటర్టైన్మెంట్ అనేది ముఖ్యం అని అన్నారు.

Unstoppable : తెలుగు సినిమా ప్రత్యేకత గురించి చెప్పిన అగ్ర నిర్మాతలు

ఇక ఐటెం సాంగ్ గురించి అడగగా అల్లు అరవింద్.. అందరూ ఎంజాయ్ చేస్తారు కానీ అదో రకంగా చూస్తారు అని అన్నారు. సురేష్ బాబు.. అక్కర్లేకుండా ఉత్సాహం చూపిస్తాం అని అన్నారు.