Sudheer Babu Hunt : లైఫ్‌లో నేను ఎంత ఎదిగినా.. నా జీవితం ఆయనకే అంకితం.. సుధీర్ బాబు!

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'హంట్'. ఈ సినిమా జనవరి 26న రిలీజ్ అవుతుండడంతో చిత్ర యూనిట్ నేడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుధీర్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.

Sudheer Babu Hunt : లైఫ్‌లో నేను ఎంత ఎదిగినా.. నా జీవితం ఆయనకే అంకితం.. సుధీర్ బాబు!

Sudheer Babu Hunt

Sudheer Babu Hunt : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హంట్’. గన్స్ డోంట్ లై అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్ తో వస్తున్న ఈ సినిమా సైకలాజికల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ మూవీలో సుధీర్ బాబు గతం మర్చిపోయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ఆడియన్స్ లో సినిమా పై అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసింది. కాగా నేడు హైదరాబాద్ ఏ ఎమ్ బి మాల్ లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

Hunt Movie Trailer : చెరిగిపోయిన గతంలో ఎవిడెన్స్‌లు వెతుకుతున్న సుధీర్ బాబు.. ‘హంట్’ మూవీ ట్రైలర్ రిలీజ్..

ఈ కార్యక్రమంలో సుధీర్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. కృష్ణ గారు చనిపోయాక ఇది నా ఫస్ట్ మూవీ రిలీజ్. ఆయన లేని వెలితి ఏంటో కనిపిస్తుంది. ఎందుకంటే నా ప్రతీ మూవీ ఆయనే ఫస్ట్ షో చూసి నాకు ఫోన్ చేసి మాట్లాడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆయన చాలా మందితో ఒక మాట చెప్పేవారు అంటా.. నేను సుధీర్, మహేష్ మూవీలు మాత్రమే చూస్తాను అని. అది నాకు చాలా గర్వకారణంగా భావించా. లైఫ్ లో నేను ఎక్కడ ఉన్నా ఎంత దూరం వెళ్లినా. నా జీవితం ఆయనకే అంకితం అంటూ ఎమోషనల్ అయ్యాడు.

కాగా ‘హంట్’ సినిమాలో సుధీర్ బాబుతో సమానమైన పాత్రలో ‘ప్రేమిస్తే’ ఫేమ్ భారత్ కనిపించబోతున్నాడు. హీరో శ్రీకాంత్ మరో ముఖ్య పాత్రలో కనిపిస్తుండగా గోపురాజ్ రమణ, మౌనిక రెడ్డి ప్రధాన పాత్రలు చేస్తున్నారు. మహేష్ సూరపనేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఒక సాంగ్ మాత్రమే ఉండబోతుంది. అంతేకాదు ఈ చిత్రంలో హీరోయిన్ కూడా లేదు. మూవీ మొత్తం సీరియస్ యాక్షన్ మోడ్ లో సాగనుంది. ఈ సినిమాను భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద్ ప్ర‌సాద్ నిర్మిస్తుండగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.