Sukumar : ‘ఆర్య’ తర్వాత పవన్ కళ్యాణ్ కి కథ చెప్పాను.. కానీ..

ఈ ఈవెంట్ లో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ''కళ్యాణ్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను నిన్నే సినిమా చూసేసాను. డైరెక్టర్ వివేక్ కూడా ఉన్నాడు. ఫస్ట్ హాఫ్ సినిమా చూసేటప్పుడు............

Sukumar : ‘ఆర్య’ తర్వాత పవన్ కళ్యాణ్ కి కథ చెప్పాను.. కానీ..

Sukumar

నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘అంటే సుందరానికి’. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులని బాగా అలరించాయి. ఈ సినిమాని ఫుల్ లెంగ్త్ కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా జూన్ 10న ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా ‘అంటే సుందరానికి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 9 గురువారం సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరగగా ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు.

ఈ ఈవెంట్ లో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ”కళ్యాణ్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను నిన్నే సినిమా చూసేసాను. డైరెక్టర్ వివేక్ కూడా ఉన్నాడు. ఫస్ట్ హాఫ్ సినిమా చూసేటప్పుడు కొత్త డైరెక్టర్ కదా బాగానే తీసాడు అనుకున్నాను. కానీ సెకండ్ హాఫ్ చూశాక అదిరిపోయింది. నేను డైరెక్టర్ అన్న ఇగో పక్కన పెట్టి వివేక్ ని మెచ్చుకున్నాను. ఇక నాని గురించి చెప్పాల్సిందేముంది. సహజ నటుడు. ఏ భావోద్వేగం అయినా చేయగలిగే నటుడు నాని. నా సినిమా షెకావత్ వైఫ్ నజ్రియా గారికి తెలుగులో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫహద్ నా సినిమా ఒప్పుకోవడానికి నజ్రియా కూడా కారణం. నేను వెళ్లి కథ చెప్పే ముందే సుకుమార్ సినిమా ఒప్పుకోండి అని నజ్రియా ఫహద్ కి చెప్పింది. నాని, నజ్రియా జంట చాలా బాగుంది. ఒకరికి ఒకరు పోటీ పడి నటించారు. మా మైత్రి నిర్మాతలు మా అదృష్టం. వరుసగా సినిమాలు హిట్ అవుతున్నాయి. మీ లాంటి నిర్మాతలు ఉండటం మా అదృష్టం.

VJ Sunny : షూటింగ్ స్పాట్ లో బిగ్‌బాస్‌ సన్నీపై దాడి.. పోలీసులకి ఫిర్యాదు..

ఆర్య తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కథ చెప్పాను. కానీ సరిగ్గా చెప్పలేకపోయాను. అప్పుడు పవన్ నన్ను పెళ్లి చేసుకోమన్నారు. భీమ్లా నాయక్ షూటింగ్ లో వెళ్లి పవన్ గారిని కలిసాను అప్పుడు నేను ఆయాసపడుతూ మాట్లాడాను. ఆ తర్వాత త్రివిక్రమ్ తో సుకుమార్ గారిని హెల్త్ చూసుకోమనండి ఏదో ఆయాసపడుతున్నారు అని చెప్పారంట. అయితే అలా ఆయాసపడింది హెల్త్ వల్ల కాదు సర్ మిమ్మల్ని చూసి ఆశ్చర్యంలో ఆయాసపడ్డాను” అని తెలిపారు.