‘పుష్ప’ లో విలన్‌గా!

‘పుష్ప’ లో విలన్‌గా!

Sunil: స్టార్ కమెడియన్‌గా కొనసాగుతుండగానే హీరోగా టర్న్ అయ్యాడు.. కష్టపడి సిక్స్ ప్యాక్‌లవి చేసినా ఆశించిన హిట్ మాత్రం దక్కలేదు.. కొంత గ్యాప్ తర్వాత స్నేహితుడు త్రివిక్రమ్ ‘అరవింద సమేత’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ‘అల…వైకుంఠపురములో’ నవ్వులు పూయించి, ‘కలర్ ఫొటో’ లో విలన్ క్యారెక్టర్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు.

ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ లో నటించబోతున్నాడు. ఈ సినిమాలో సునీల్ నెగెటివ్ రోల్ చేయనున్నాడట. విలన్ క్యారెక్టర్ కోసం ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతిని అనుకున్నారు కానీ డేట్స్ ప్రాబ్లమ్ వల్ల కుదరలేదు. ఆ పాత్రనే సునీల్ చేత చేయిస్తున్నారనే మాట కూడా వినబడుతోంది. తర్వాతి షెడ్యూల్‌లో ‘పుష్ప’ టీంతో జాయిన్ అవనున్నాడు సునీల్.

‘ఆర్య, ఆర్య-2’ తర్వాత బన్నీ-సుక్కు కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.. ఆగస్టు 13న ‘పుష్ప’ రాజ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

PUSHPA