Sunny Leone : బన్నీతో స్పెషల్ సాంగ్ కోసం సన్నీ అంత అడిగిందా..!

సన్నీ లియోన్ కొంత గ్యాప్ తర్వాత ‘పుష్ప’లో ఐటెం సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది..

Sunny Leone : బన్నీతో స్పెషల్ సాంగ్ కోసం సన్నీ అంత అడిగిందా..!

Sunny Leone

Sunny Leone: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంస్థలు కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళీ వెర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.

Pushpa : ‘పుష్ప’ రాజ్.. అస్సలు ‘తగ్గట్లే’దుగా..

బన్నీ, డీఎస్పీ, సుకుమార్ కాంబోలో వచ్చే ఐటెం సాంగ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో, మాస్ ఆడియెన్స్‌కి ఎంతటి కిక్ ఇస్తాయో కొత్తగా చెప్పక్కర్లేదు. ‘ఆర్య’, ‘ఆర్య-2’ కి ఏమాత్రం తగ్గకుండా ఈ హ్యాట్రిక్ ఫిలింకి అదిరిపోయే ఐటెం నంబర్ కంపోజ్ చేస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్. స్పెషల్ సాంగ్‌లో బన్నీతో కలిసి స్టెప్పులెయ్యడానికి సన్నీ లియోన్‌ని అప్రోచ్ అయ్యారు నిర్మాతలు.

Allu Arjun Tattoo : ‘ఆవేశాన్ని ఆపగలం కానీ, అభిమానాన్ని ఆపలేం’.. నుదుటి మీద అల్లు అర్జున్ పర్మినెంట్ టాటూ..

మంచు మనోజ్ ‘కరెంట్ తీగ’ లో కాసేపు మెరిసిన సన్నీ కొద్దికాలం తర్వాత ఐటెం సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. కాకపోతే రెమ్యునరేషన్ అక్షరాలా 90 లక్షలు అడిగిందట. అమ్మడికున్న డిమాండ్ అలాంటింది కాబట్టి అడిగినంత ఇవ్వడానికి రెడీ అయ్యారు మేకర్స్. రెండు పార్టులుగా రాబోతున్న ‘పుష్ప’ పాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది.

Pushpa : ‘పుష్ప’ కోసం ఓవరాల్ ఇండియా వెయిట్ చేస్తోంది..!