సైరా – బాంబే ప్రమోషన్స్‌లో చిరు సందడి

సైరా హిందీ ప్రమోషన్స్ కోసం బాంబే వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి.. తమన్నా, బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఫర్హాన్ అక్తర్‌తో కలిసి సైరా ప్రమోషన్స్‌లో సందడి చేసిన చిరు..

  • Published By: sekhar ,Published On : September 28, 2019 / 07:34 AM IST
సైరా – బాంబే ప్రమోషన్స్‌లో చిరు సందడి

సైరా హిందీ ప్రమోషన్స్ కోసం బాంబే వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి.. తమన్నా, బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఫర్హాన్ అక్తర్‌తో కలిసి సైరా ప్రమోషన్స్‌లో సందడి చేసిన చిరు..

మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక చిత్రం.. ‘సైరా నరసింహారెడ్డి’.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ‘సైరా’  భారీగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.  హిందీ ప్రమోషన్స్‌లో భాగంగా చిరు బాంబే వెళ్లారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, నటుడు, నిర్మాత, దర్శకుడు ఫర్హాన్ అక్తర్‌తో కలిసి సైరా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. మిల్కీబ్యూటీ తమన్నాతో కలిసి పలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలకు ఇంటర్వూలిచ్చారు.

రితేష్ సిద్వాణీ, ఫర్హాన్ అక్తర్‌, ఏఏ ఫిల్మ్స్.. కొణిదెల ప్రొడక్షన్‌తో కలిసి హిందీలో విడుదల చేస్తున్నారు. వీరి సహకారంతో బాలీవుడ్‌లోనూ సైరా భారీ స్థాయిలో విడుదలవుతోంది. 
తొలితరం స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు..

Read Also : బెంగుళూరులో సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్..

 సైరాలో అమితాబ్ బచ్చన్, నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించనుండగా, నయనతార, నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మగా.. తమన్నా, లక్ష్మీగా నటించారు. వీరా రెడ్డిగా జగపతిబాబు, అవుకు రాజుగా ‘కిచ్చా’ సుదీప్, రాజా పాండిగా ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, బసి రెడ్డిగా రవి కిషన్ కనిపించనున్నారు.