విజయ్ ప్లేస్‌లో జీవా

కపిల్ దేవ్ బయోపిక్‌లో కృష్ణమాచారి శ్రీకాంత్ క్యారెక్టర్‌లో తమిళ నటుడు జీవా.

  • Published By: sekhar ,Published On : January 30, 2019 / 07:03 AM IST
విజయ్ ప్లేస్‌లో జీవా

కపిల్ దేవ్ బయోపిక్‌లో కృష్ణమాచారి శ్రీకాంత్ క్యారెక్టర్‌లో తమిళ నటుడు జీవా.

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండియన్ సినిమా ఇండస్ట్రీలలో ప్రస్తుతం బయోపిక్‌ల హవా కొనసాగుతుంది. రణ్‌వీర్ సింగ్, డైరెక్టర్ కబీర్ ఖాన్ కాంబినేషన్‌లో క్రికెట్ దిగ్గజం, కపిల్ దేవ్ బయోపిక్ రూపొందనున్న సంగతి తెలిసిందే. రణ్‌వీర్ రోహిత్ షెట్టి డైరెక్షన్‌లో తెలుగు టెంపర్‌కి రీమేక్‌గా చేసిన సింబా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత  రణ్‌వీర్ సింగ్, ’83లో, కపిల్ దేవ్ పాత్రలో నటించనున్నాడు. ఈ మూవీలో ప్రముఖ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ క్యారెక్టర్‌‌లో, టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండని నటింపచెయ్యడానికి మూవీ యూనిట్ ప్రయత్నిస్తుందని, విజయ్ దేవరకొండ కూడా శ్రీకాంత్ క్యారెక్టర్ చెయ్యడానికి ఓకే చెప్పాడని కొద్ది రోజుల క్రితం వార్తలొచ్చాయి.

ఇప్పుడు ఆ క్యారెక్టర్‌లో యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు జీవా నటించబోతున్నాడు. తెలుగులో జీవా.. ఈ, రంగం, స్నేహితుడు వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కపిల్ దేవ్ బయోపిక్‌లో కృష్ణమాచారి శ్రీకాంత్  పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉందని, ఈ సినిమా ద్వారా హిందీ ఇండస్ట్రీలోనూ గుర్తింపు తెచ్చుకుంటానని కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు జీవా.