Evaru Meelo Koteeswarulu: తారక్ షో.. దసరాకి మహేష్.. దీపావళికి ప్రభాస్!

ఒకప్పుడు టాలీవుడ్ వేరు.. ఇప్పుడు టాలీవుడ్ వేరు. యంగ్ హీరోల మధ్య బాండింగ్ చూస్తే మిగతా రాష్ట్రాల సినీ ఇండస్ట్రీలు కుళ్ళుకోనేలా ఉంది వాతావరణం. ఒకరి సినిమాలకు ఒకరు సపోర్ట్..

Evaru Meelo Koteeswarulu: తారక్ షో.. దసరాకి మహేష్.. దీపావళికి ప్రభాస్!

Evaru Meelo Koteeswarulu

Evaru Meelo Koteeswarulu: ఒకప్పుడు టాలీవుడ్ వేరు.. ఇప్పుడు టాలీవుడ్ వేరు. యంగ్ హీరోల మధ్య బాండింగ్ చూస్తే మిగతా రాష్ట్రాల సినీ ఇండస్ట్రీలు కుళ్ళుకోనేలా ఉంది వాతావరణం. ఒకరి సినిమాలకు ఒకరు సపోర్ట్ చేసుకోవడమే కాదు.. బావా బ్రో అంటూ ఆప్యాయంగా ఒకరికి ఒకరు ఒద్దికగా కలిసిపోతున్నారు. ప్రజెంట్ టాలీవుడ్ లో అందరూ ఒకరికొకరం అనుకుంటూ సాయం చేసుకుంటున్నారు. ఒకరి షూటింగ్ స్పాట్ కి మరొకరు వస్తూ.. ఒకరి షోకి మరొకరు అటెండ్ అవుతూ తమ మధ్య ఉన్న ఫ్రెండ్లీ బాండ్ ని చూపిస్తున్నారు.

Evaru Meelo Koteeswarulu: హీరోలంతా ఒక్కటే.. అందరినీ గేదర్ చేస్తున్న తారక్!

సిల్వర్ స్క్రీన్ నుండి బుల్లితెర వరకు తనను తానేంటో చూపించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ స్మాల్ స్క్రీన్ మీద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి వరుసగా టాప్ స్టార్స్ క్యూ కడుతున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ క్రేజీ మల్టీస్టారర్ కోసం మూడేళ్ళగా తనతో కలిసి ట్రావెల్ చేస్తున్న చరణ్ తోనే లాంచింగ్ ఈవెంట్ చేసిన తారక్ ఈ మధ్యనే తనకి అత్యంత సన్నిహితులైన దర్శకులు రాజమౌళి, కొరటాల శివలను కూడా తీసుకొచ్చాడు.

Evaru Meelo Koteeswarulu : తారక్ షో కి గెస్ట్‌గా మహేష్ బాబు..

కాగా, ఇక ఇప్పుడు మహేష్, ప్రభాస్ కూడా ఈ షోలో గెస్టులుగా రానున్నారు. మహేష్ ఎపిసోడ్ ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి కాగా దసరా స్పెషల్ గా ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని షో నిర్వాహకులు అధికారికంగా వెళ్లడించలేదు కాని కొన్ని పిక్స్ మాత్రం లీక్ అయ్యాయి. ఆ తర్వాత ప్రభాస్ ను కూడా రంగంలోకి దించేందుకు జెమిని టీవీ వారు ప్రయత్నాలు చేస్తున్నారు.

Pawan-Kartikeya: పవన్ సార్‌కి మద్దతు ఇవ్వడం నా బాధ్యత.. హీరో కార్తికేయ

ఇలాంటి షో ల్లో ప్రభాస్ ఎక్కువగా కనిపించేందుకు ఆసక్తి చూపించడు. కాని ఎన్టీఆర్ హోస్ట్.. దేశ వ్యాప్తంగా పేరున్న గేమ్ షో కావడంతో ప్రభాస్ హాజరుకానున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ ఎపిసోడ్ వీలైనంత త్వరలో షూట్ చేసి దీపావళి కానుకగా ఈ ఎపిసోడ్ ప్రసారం చేయనున్నట్లు తెలుస్తుంది. మహేష్, ప్రభాస్ మాత్రమే కాదు ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకులు సుకుమార్ వంటి ప్రముఖులతో కూడా ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తుంది. మరి అదే నిజమైతే ఈ స్టార్ హీరోల అభిమానులకు పండగలాంటిదే.