Alia Bhatt: టార్గెట్ 2022.. సీనియర్ హీరోయిన్స్‌ను మించిపోతున్న అలియా

బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ అయినా.. సినిమాల విషయంలో స్టార్ ఇమేజ్ విషయంలో మాత్రం సీనియర్ హీరోయిన్లను మించి పోతోంది అలియా. 2020, 2021లో ఎన్నో ప్లాన్లేసుకున్న అలియాకి..

Alia Bhatt: టార్గెట్ 2022.. సీనియర్ హీరోయిన్స్‌ను మించిపోతున్న అలియా

Alia Bhatt

Alia Bhatt: బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ అయినా.. సినిమాల విషయంలో స్టార్ ఇమేజ్ విషయంలో మాత్రం సీనియర్ హీరోయిన్లను మించి పోతోంది అలియా. 2020, 2021లో ఎన్నో ప్లాన్లేసుకున్న అలియాకి కోవిడ్ పెద్ద షాక్ ఇచ్చింది. కానీ 2022లో మాత్రం ఇటు పెళ్లిని, అటు వరుసగా సినిమాల రిలీజ్ ల్ని గట్టిగానే ప్లాన్ చేసింది.

Bigg Boss 5: నలుగురు సేఫ్.. నో డౌట్ ఎలిమినేషన్ మాస్టరే?

సినిమాల విషయంలో సెలెక్టెడ్ గా ఉండే అలియా డిఫరెంట్ మూవీ స్ చేస్తూనే కెరీర్ లో ఫుల్ బిజీ ఉంది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కెరీర్ వైజ్ గా సినిమాలన్నీ రిలీజ్ ఆగిపోయి పెద్ద బ్రేక్ పడిపోయింది. అయితే 2022లో మాత్రం పక్కా ప్లానింగ్ తో రెడీ అవుతోంది అలియా. రీసెంట్ గా తన అప్ కమింగ్ మూవీ గంగూభాయ్ కతియా వాడి సినిమాని జనవరి 6న రిలీజ్ చేస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో కాంట్రవర్సీల్ని దాటుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది.

RRR : బాహుబలి కలెక్షన్స్ పై కన్నేసిన ఆర్ఆర్ఆర్

గంగూభాయ్ కతియా వాడి రిలీజ్ అయ్యిందో లేదో.. మరో మూవీని కూడా లైనప్ చేసేసింది అలియా భట్. ప్యాన్ ఇండియా లెవల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కూడా జనవరిలోనే రిలీజ్ అవుతోందంటూ టాక్ నడుస్తోంది. ఈసినిమా జనవరి 12న రిలీజ్ అయితే అలియాకి 2022 గుడ్ స్టార్ట్ అనే చెప్పుకోవాలి.

Alia Bhatt : రెండు రోజులు అలియా సందడి..

ప్రొఫెషనల్ లైఫ్ సంగతి పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్ లోకూడా 2022 అలియాకి బెస్ట్ ఇయర్ కాబోతోంది. ఆల్రెడీ లవ్ లో ఉన్న రణబీర్ కపూర్, అలియా.. కోవిడ్ లేకపోతే ఇప్పటికి పెళ్లి చేసుకుని ఉండేవాళ్లు. అయితే సెకండ్ వేవ్ తర్వాత సిచ్యువేషన్ బెటర్ అవ్వడంతో ఈ డిసెంబర్ లో కానీ.. నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లో కానీ.. పెళ్ళి చేసుకుందామని డిసైడ్ అయ్యారని బాలీవుడ్ లో న్యూస్ నడుస్తోంది. ఇలా అలియా అటు పర్సనల్ గా ప్రొఫెషనల్ గా 2022 కి గుడ్ స్టార్ట్ ఇవ్వబోతోంది.