Vijay: తల్లిదండ్రులపై కేసు పెట్టిన హీరో విజయ్.. కారణం ఇదే!

తన అనుమతి లేకుండా పేరు, ఫోటోను వాడుతున్నారంటూ తమిళ సినీనటుడు విజయ్ తన తల్లిదండ్రులతో పాటు మరో 11 మందిపై కేసు పెట్టారు.

Vijay: తల్లిదండ్రులపై కేసు పెట్టిన హీరో విజయ్.. కారణం ఇదే!

Vijay

Vijay: తన అనుమతి లేకుండా పేరు, ఫోటోను వాడుతున్నారంటూ తమిళ సినీనటుడు విజయ్ తన తల్లిదండ్రులతో పాటు మరో 11 మందిపై కేసు పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఏడాది క్రితం విజయ్‌ మక్కల్‌ ఇయ్యకమ్‌ పేరుతో విజయ్ తండ్రి చంద్రశేఖర్‌ పార్టీ పెట్టగా పార్టీకి ప్రధాన కార్యదర్శి, కోశాధికారిగా విజయ్‌ తల్లిదండ్రులు ఉన్నారు.

తండ్రి పెట్టిన పార్టీతో తనకు సంబంధం లేదని హీరో విజయ్‌ గతంలో ప్రకటించినా.. తల్లిదండ్రులు విజయ్‌పేరుతో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. తన పేరు వాడుకుంటున్నారని ఆరోపిస్తూ విజయ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈఘటన తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించగా.. ఈకేసు విచారణలో ఓ సమస్య కూడా ఉత్పన్నం అయ్యింది.

ఆగస్టు 23న కేసు విచారణకు వచ్చినప్పుడు, ఈ కేసులో కౌంటర్ పిటిషనర్లలో ఆరుగురికి నోటీసు అందలేదు. అప్పుడు SA చంద్రశేఖర్, శోభల తరపున ఒక సమాధానం దాఖలు చేశారు. అయితే ఈ కేసు పెట్టిన నటుడు విజయ్ కోసం న్యాయవాది ఎవరూ హాజరు కాకపోవడంతో సమస్య వచ్చింది.

విజయ్ తరపున ఎవరూ హాజరుకాకపోవడంతో కేసు విచారణలో సమస్య ఏర్పడింది. న్యాయమూర్తి పిటిషన్లను కౌంటర్ పిటిషనర్లకు తిరిగి ఇచ్చారు. కేసును సెప్టెంబర్ 27కి వాయిదా వేయగా.. అదే రోజున రిప్లై పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. విజయ్ తన తండ్రి మరియు తల్లికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 27న కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.