This Week Movies : ఈ వారం థియేటర్స్, ఓటీటీలలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే..

పెద్ద సినిమాల సీజన్ అయిపోయింది. వరస పెట్టి స్టార్ హీరోలందరూ సంక్రాంతి నుంచి స్టార్ట్ చేసి మొన్నటి వరకూ వరస పెట్టి మూవీస్ అన్నీ రిలీజ్ చేశారు. ఇక మళ్లీ సమ్మర్ లో సినిమాల సీజన్ స్టార్ట్ అయ్యే వరకూ ధియేటర్లో చిన్న సినిమాలదే హవా...............

This Week Movies : ఈ వారం థియేటర్స్, ఓటీటీలలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే..

This Week Theatrical and OTT releasing Movies

This Week Movies :  పెద్ద సినిమాల సీజన్ అయిపోయింది. వరస పెట్టి స్టార్ హీరోలందరూ సంక్రాంతి నుంచి స్టార్ట్ చేసి మొన్నటి వరకూ వరస పెట్టి మూవీస్ అన్నీ రిలీజ్ చేశారు. ఇక మళ్లీ సమ్మర్ లో సినిమాల సీజన్ స్టార్ట్ అయ్యే వరకూ ధియేటర్లో చిన్న సినిమాలదే హవా. ధియేటర్లో ఎలాగూ పెద్ద సినిమాలు లేకపోయినా ఓటీటీలో మాత్రం పెద్ద సినిమాలు వరసపెట్టి ట్రీట్ ఇవ్వబోతున్నాయి. ఈవారం అటు ధియేటర్లు, ఇటు ఓటీటీల్లో ఆడియన్స్ ముందుకొస్తున్న సినిమాలు ఇవే..

mr.King అనే సినిమా ఫిబ్రవరి 24వ తేదీన ధియేటర్లోకొస్తోంది. శశిధర్ డైరెక్షన్లో శరణ్, యష్విక, ఉర్వి లీడ్ రోల్స్ లో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మిస్టర్ కింగ్ మూవీ ఈ శుక్రవారం ధియేటర్లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ వారం ధియేటర్లోకి వస్తున్న మరో ఇంట్రస్టింగ్ మూవీ కోనసీమ థగ్స్. తమిళ్ లో బృంద డైరెక్షన్లో తెరకెక్కిన థగ్స్ మూవీని తెలుగులో కోనసీమ థగ్స్ గా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. బాబీ సింహ, హ్రిధు లీడ్ రోల్స్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కోనసీమ థగ్స్ ఈ శుక్రవారం ఫిబ్రవరి 24న ధియేటర్లోకి వస్తోంది.

తెలుగులో పెద్ద సినిమాలు రిలీజ్ కు లేకపోయినా బాలీవుడ్ లో మాత్రం అక్షయ్ కుమార్ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. లాస్ట్ ఇయర్ బ్యాక్ టూ బ్యాక్ 5 ఫ్లాపులతో కెరీర్ లో డిజాస్టర్ ఫేజ్ లో ఉన్న అక్షయ్ కుమార్ సెల్ఫీ అనే సినిమాతో రాబోతున్నాడు. అక్షయ్, ఇమ్రాన్ హష్మి కాంబినేషన్లో మలయాళం సూపర్ హిట్ సినిమా డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ గా తెరకెక్కిన సెల్ఫీ సినిమా ఫిబ్రవరి 24నే ధియేటర్లోకొస్తోంది.

ఇక ఈ వీక్ లో థియేటర్స్ లో అంతగా చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోయినా ఓటీటీలో మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. సంక్రాంతికి ధియేటర్లో సూపర్ హిట్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపిన సినిమాలన్నీ ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. ఆల్రెడీ వారసుడు సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 22 నుంచే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. సంక్రాంతి బరిలోకే దిగిన నందమూరి బాలకృష్ణ మూవీ వీరసింహారెడ్డి నేడు ఫిబ్రవరి 23 నుంచి డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. మరో సంక్రాంతి సూపర్ హిట్ సినిమా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య వచ్చేవారం మొదట్లో ఫిబ్రవరి 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.

Chiranjeevi : ఆ డైరెక్టర్ కి మెగాస్టార్ హ్యాట్రిక్ సినిమా ఇస్తాడా?

వారం వారం కొత్త సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే అచ్చ తెలుగు ఓటీటీ ఆహా ఈ వారం కూడా సరికొత్త సినిమాతో రాబోతుంది. సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, వరుణ్ సందేశ్ లాంటి స్టార్స్ తో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా మైఖెల్ ఫిబ్రవరి 24 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవ్వబోతోంది.