కరోన వేళ..రాఘవేంద్ర రావు సైకిల్ రైడింగ్

  • Published By: madhu ,Published On : July 13, 2020 / 07:23 AM IST
కరోన వేళ..రాఘవేంద్ర రావు సైకిల్ రైడింగ్

కరోనా వైరస్ అందర్నీ అష్టకష్టాల పాలు చేస్తోంది. సామాన్యుడి నుంచి మొదలుకుని సెలబ్రెటీల వరకు ఈ వైరస్ బారిన పడుతున్నారు. దీని కారణంగా కొన్ని రంగాలు పనిచేయకుండా పోయాయి. అందులో సినిమా రంగం కూడ ఒకటి. షూటింగ్స్ లేకపోవడంతో…దర్శక, నిర్మాతలు, హీరోలు ఇంటికే పరిమితమయ్యారు. కానీ..ఖాళీగా ఉండకుండా..ఏదో ఒక పనులు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియలో షేర్ చేస్తున్నారు. ఇందులో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కూడా చేరారు.

టాలీవుడ్ లో భక్తి, రోమాంటిక్ సినిమాలతో పేరు తెచ్చుకున్నారు రాఘవేంద్ర రావు. ఎన్నో అపురూపమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఈయన ఇంటికే పరిమితమయ్యారు. వ్యాయామాలు చేస్తూ..గడిపేస్తున్నారు. ఇంటి ప్రాంగణంలో పచ్చికబయళ్లపై సైకిల్ తొక్కుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను..సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ వీడియోలో రాఘవేంద్ర రావు సైకిల్ నడుపుతుంటే…వెనుకాలే ఆయన పెంపుడు కుక్క రావడం కనిపించింది. సైకిల్ తొక్కుతూ ఆరోగ్యం కాపాడుకోవడం, వెనుకాలే కుక్క రావడం..అంటే..నమ్మదగిన స్నేహితుడు..చెట్లు, పచ్చిక బయళ్లు, ప్రకృతిని ఆస్వాదిస్తూ..ఇలా మూడింటిని ఒకే వీడియోలో చూపించిన ఈ దర్శకేంద్రుడు…తన సృజనాత్మకతను చాటుకున్నారు.

తెలుగు సినిమాకు కమర్షియల్ సొబగులు అద్దిన దర్శకుల్లో రాఘవేంద్ర రావు ఒకరు. ఆయన స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. హీరోయిన్ ను గ్లామరస్ గా చూపించడంలో రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా…అని చెప్పవచ్చు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఏర్పరుచుకున్నరు. ఈయన 1942 మే 23వ తేదిన కృష్ణా జిల్లా, కంకిపాడు మండలం, కోలవెన్ను గ్రామంలో జన్మించారు.