Tollywood Movies : అదిరిపోయిన టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్.. హిట్స్ ఎక్కువే..

ఫస్ట్ క్వార్టర్ లో చాలా వరకు సినిమాలు ప్రేక్షకులని మెప్పించాయి. ఈ సంవత్సరం టాలీవుడ్ సూపర్ కిక్ స్టార్ట్ తోనే మొదలైంది. ఫస్ట్ క్వార్టర్ లో సంక్రాంతి ఎంత సంబరంగా సందడిగా సక్సెస్ ఫుల్ గా స్టార్ట్ అయ్యిందో అంతే సందడిగా, సక్సెస్ ఫుల్ ఫస్ట్ క్వార్టర్ ని ఎండ్ చేశారు.

Tollywood Movies : అదిరిపోయిన టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్.. హిట్స్ ఎక్కువే..

Tollywood Movies result in Firs quarter Veerasimha Reddy to Dasara

Tollywood Movies :  2023లో అప్పుడే 3 నెలలు అయిపోయాయి. సినిమాలకు పెద్ద సీజన్ అయిన సంక్రాంతి(Sankranthi) నుంచి మార్చి వరకూ 3 నెలల్లో స్టార్ హీరోల పెద్ద సినిమాలతో పాటు యంగ్ హీరోల ఇంట్రస్టింగ్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ క్వార్టర్ లో చాలా వరకు సినిమాలు ప్రేక్షకులని మెప్పించాయి. ఈ సంవత్సరం టాలీవుడ్(Tollywood) సూపర్ కిక్ స్టార్ట్ తోనే మొదలైంది. సంక్రాంతి సీజన్ లో నువ్వా నేనా అంటూ పోటాపోటీగా రిలీజైన వీరసింహారెడ్డి(Veerasimha Reddy), వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించాయి. జనవరి 12న వీరసింహారెడ్డిగా బాలకృష్ణ(Balakrishna) తన మాస్ పవర్ కంటిన్యూ చేస్తే జనవరి 13న వింటేజ్ హీరోగా చిరంజీవి(Chiranjeevi) ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసి100కోట్లకు పైగా కలెక్షన్లతో టాలీవుడ్ కి హిట్ బోణీ కొట్టారు.

అయితే సంక్రాంతి సీజన్ లోనే జనవరి 14న రిలీజ్ అయిన సంతోష్ శోభన్ కళ్యాణం కమనీయం సినిమా మాత్రం బాలకృష్ఱ, చిరంజీవి సినిమాల మధ్యలో కనపడకుండాపోయింది. థియేటర్స్ లో ఫ్లాప్ అయినా ఓటీటీలో వచ్చాక మాత్రం పర్వాలేదనిపించింది. ఇక ఎప్పుడూ ఎక్స్‌పరిమెంటల్ సినిమాలు చేసే సుధీర్ బాబు ఈ సారి కూడా ఇంట్రస్టింగ్ మలయాళ మూవీని హంట్ టైటిల్ తో రీమేక్ చేశారు. జనవరి 26 వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ లిస్ట్ లో నిలిచింది.

జనవరి బాక్సాఫీస్ ట్రెండ్ ని ఫిబ్రవరిలో కూడా కంటిన్యూ చేద్దామని చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఫిబ్రవరి 3న సందీప్ కిషన్ పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో పాటు భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కించిన మైఖెల్ కూడా ఫ్లాప్ అయింది. కానీ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు సందీప్. ఇక ఫిబ్రవరి 4న రిలీజ్ అయిన బుట్టబొమ్మ మాత్రం కలెక్షన్స్ రాకపోయినా ఫర్వాలేదనిపించింది. బింబిసారతో ఫుల్ ఫామ్ లో ఉన్న కళ్యాణ్ రామ్ ఈ సారి ట్రిపుల్ రోల్ లో కంప్లీట్ డిఫరెంట్ స్టోరీగా ఫిబ్రవరి 10న అమిగోస్ మూవీతో ధియేటర్లోకొచ్చారు. బింబిసార అంత సక్సెస్ కాకపోయినా డీసెంట్ హిట్ అందుకున్నారు. శ్రీకర స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కిన ధనుష్ సార్ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఎడ్యుకేషన్ మాఫియా ఆధారంగా ఫిబ్రవరి 17న రిలీజ్ అయిన సార్ మూవీ రీసెంట్ టైమ్స్ లో నాన్ కమర్షియల్ మూవీస్ లో ఫస్ట్ ప్లేస్ సంపాదించుకుంది. కమర్షియల్ గా కూడా సక్సెస్ అయి 100 కోట్లు సాధించింది.

Honey Rose : నాకు నచ్చిన డ్రెస్ లు వేసుకుంటా.. ఎలాంటి డ్రెస్ లు వేసుకోవాలనేది మా ఇష్టం..

సార్ మూవీ కలెక్షన్లు, క్రేజ్ కంటిన్యూ అవుతుండగానే ఫిబ్రవరి 18న రిలీజ్ అయిన కిరణ్ అబ్బవరం వినరో భాగ్యమువిష్ఱు కథ సినిమా పర్వాలేదనిపించి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది. చిరంజీవి కూతురు సుస్మిత ప్రొడ్యూసర్ గా సంతోష్ శోభన్ హీరోగా ఫిబ్రవరి 18నే రిలీజ్ అయిన శ్రీదేవి శోభన్ బాబు మూవీ అసలు అడ్రస్ లేకుండా పోయింది.

ఫిబ్రవరి కాస్త అటూ ఇటుగా ఉన్నా మార్చి నెలలో సినిమాలు మాత్రం గట్టిగానే రిలీజ్ అయ్యాయి. జనరల్ గా మార్చి ఎగ్జామ్స్ టైమ్ కాబట్టి పెద్ద సినిమాలు రిలీజ్ చెయ్యడానికి అంతగా ఇంట్రస్ట్ చూపించరు. అందుకే చిన్న హీరోలందరూ మార్చి మీదే దండయాత్ర చేశారు. మార్చిలో పెద్దగా ఇంట్రస్టింగ్ సినిమాలు లేవనుకున్న ఆడియన్స్ కి రూటెడ్ స్టోరీని కళ్లకు కట్టినట్టు చూపించింది బలగం సినిమా. దిల్ రాజు ప్రొడక్షన్ లో ప్రియదర్శి లీడ్ రోల్ లో వేణు డైరెక్ట్ చేసిన తెలంగాణ బ్యాక్ డ్రాప్ మూవీ మార్చి 3న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన బలగం సినిమా ఓటీటీలో రిలీజ్ అయినా కూడా మంచి ధియేటర్ రన్ కంటిన్యూ చేసింది.

Telangana Movies : తెలంగాణ కథలకి జై కొడుతున్న టాలీవుడ్..

మార్చి 10న వరసగా సినిమాలు చేస్తూనే ఉన్న ఆదిసాయికుమార్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిఎస్ ఐ సనతన్ రిలీజ్ అయ్యింది. రిలీజ్ కు ముందు ట్రైలర్లు ఇంట్రస్ట్ క్రియేట్ చేసినా ఆ రేంజ్ హిట్ మాత్రం కొట్టలేకపోయాడు ఆదిసాయికుమార్. నాగశౌర్య మార్చి 17న ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయిసినిమా రిలీజ్ చేశారు. అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కినఈ మూవీ శౌర్యకి హిట్ అందించలేకపోయింది.

మార్చి 22న 2 సినిమాలు నువ్వానేనా అంటూపోటీపడ్డాయి. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దాస్ కా దమ్కీ ఒక వైపు, కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా రంగమార్తాండ మరో వైపు. విష్వక్ స్వీయ దర్శకత్వ నిర్మాణంలో తెరకెక్కిన ధమ్కీ మాస్, యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటే కృష్ణవంశీ డైరెక్షన్లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ లీడ్ రోల్స్ లో వచ్చిన రంగమార్తాండ ఫ్యామిలీ సెక్షన్ కి కనెక్ట్ అయ్యింది. రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి.

Rahul Dev : సౌత్ సినిమాల్లో ఇప్పటికి అవే కథలు.. ఏం మారట్లేదు.. స్టార్ విలన్ సంచలన వ్యాఖ్యలు..

ఫస్ట్ క్వార్టర్ లో సంక్రాంతి ఎంత సంబరంగా సందడిగా సక్సెస్ ఫుల్ గా స్టార్ట్ అయ్యిందో అంతే సందడిగా, సక్సెస్ ఫుల్ ఫస్ట్ క్వార్టర్ ని ఎండ్ చేశారు నాని. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ ని పరిచయం చేస్తూ నాని చేసిన దసరా సినిమా మార్చి 30న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయ్యింది. మూడు రోజులకే 70 కోట్లు వసూలు చేసి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మొత్తానికి కొన్ని ఫ్లాప్స్ పడ్డా ఈ మూడు నెలల్లో సక్సెస్ రేటు ఎక్కువగానే ఉంది. మున్ముందు కూడా ఇదే సక్సెస్ రేటు టాలీవుడ్ మైంటైన్ చేస్తుందేమో చూడాలి.