Devi Sriprasad: దేవి శ్రీ ప్రసాద్ ఇంట్లో విషాదం.. ఇద్దరు మృతి!

సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయప దేవీ శ్రీ ప్రసాద్ బాబాయి బుల్గానిన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Devi Sriprasad: దేవి శ్రీ ప్రసాద్ ఇంట్లో విషాదం.. ఇద్దరు మృతి!

Devi Sri

Devi Sriprasad: ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయప దేవీ శ్రీ ప్రసాద్ బాబాయి బుల్గానిన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ వార్త విని తట్టుకోలేక దేవి శ్రీ ప్రసాద్ మేనత్త సీతామహాలక్ష్మీ గుండెపోటుతో చనిపోయారు. దీంతో దేవి శ్రీ ప్రసాద్ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.

దేవిశ్రీ ప్ర‌సాద్ ఇంట్లో మ‌ర‌ణ‌వార్త‌ల గురించి సమాచారం తెలుసుకుని సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ రైటర్ సత్యమూర్తి తనయుడు కాగా.. సత్యమూర్తి తమ్ముడే బుల్గానిన్.. రష్యన్ కమ్యూనిస్టు లీడర్ బుల్గానిన్ చనిపోయిన రోజే పుట్టడంతో.. ఆయన తండ్రి నారాయణ తన చిన్న కొడుకుకు బుల్గానిన్ అనే పేరు పెట్టారు. నారాయణ పిల్లలు అందరూ ఒకరంటే ఒకరు ప్రేమగా ఉండేవారు.

దేవిశ్రీప్రసాద్ మేనత్త కొమ్ముల సీతామహాలక్ష్మికి ఈ కుటుంబం అంటే అమితమైన ప్రేమ.. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక దేవీశ్రీ ప్రసాద్ తండ్రి స్వగ్రామం కాగా.. సత్యమూర్తి తండ్రి నారాయణ కమ్యూనిస్ట్ పార్టీలో లీడర్‌గా ఉన్నారు. ఆయనకి ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు కాగా పెద్ద కూతురు సీతామహలక్ష్మి, తర్వాత కొడుకులు హరినారాయణ, సత్యమూర్తి, బుల్గానిన్, జ్యోతి, గౌరీపార్వతి.

ఆరుగురు సంతానంలో అక్క సీతామహలక్ష్మి కుటుంబాన్ని ప్రతీ విషయంలోనూ ప్రోత్సహించేది అని చెబుతుంటారు. ఆమె ప్రోత్సాహంతోనే సత్యమూర్తి సినీరంగంలోకి వచ్చినట్లుగా చెబుతారు. దేవిశ్రీప్రసాద్ ఫ్యామిలీకి సీతామాలక్ష్మి కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బాబాయ్, మేనత్తలు ఒకేసారి ఆకస్మికంగా మృతి చెందడంతో దేవిశ్రీప్రసాద్ సహా ఆయన కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. బుల్గానిన్ కొడుకు విజయ్ బుల్గానిన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నారు. బుల్గానిన్ కూడా చాలా హిట్ పాటలకు మ్యూజిక్ అందించారు.