Waltair Veerayya: వీరయ్య బాస్ పార్టీ కోసం ఊర్వశి రెమ్యునరేషన్.. ఎంతో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టా‌క్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించగా, ఈ సినిమాను మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ ఊరమాస్ అవతారం మెగా ఫ్యాన్స్‌కు మంచి కిక్కిచ్చింది. అయితే ఈ సినిమాలోని బాస్ పార్టీ సాంగ్ ప్రేక్షకులందరికీ విపరీతంగా నచ్చిన సంగతి తెలిసిందే.

Waltair Veerayya: వీరయ్య బాస్ పార్టీ కోసం ఊర్వశి రెమ్యునరేషన్.. ఎంతో తెలుసా..?

Urvashi Rautela Remuneration For Boss Party Song In Waltair Veerayya Goes Viral

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టా‌క్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించగా, ఈ సినిమాను మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ ఊరమాస్ అవతారం మెగా ఫ్యాన్స్‌కు మంచి కిక్కిచ్చింది. అయితే ఈ సినిమాలోని బాస్ పార్టీ సాంగ్ ప్రేక్షకులందరికీ విపరీతంగా నచ్చిన సంగతి తెలిసిందే.

Waltair Veerayya : వీరయ్య విజయ విహారానికి చిట్టిబాబు..

ఈ సాంగ్‌లో వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అనేలా ఆయన డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక దేవిశ్రీ అందించిన మ్యూజిక్ ఈ సాంగ్‌ను ఆడియెన్స్‌కు మరింత చేరువ చేసింది. కాగా, ఈ సాంగ్‌లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా చిరుతో కలిసి స్టెప్పులేసింది. బాస్ పార్టీ అంటూ ఆమె చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. అయితే తాజాగా ఆమె ఈ పాటలో చిందులేసిందుకు ఎంతమేర రెమ్యునరేషన్ తీసుకుందనే వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సాంగ్ కోసం ఊర్వశి ఏకంగా రూ.2 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Waltair Veerayya : 2.25 రేటింగ్ ఇచ్చారు.. నేడు 2.25 మిలియన్స్ సాధించింది.. చిరంజీవి!

బాస్ పార్టీ సాంగ్‌లో ఆమె కేవలం 3 నిమిషాలు కనిపించగా, ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సినిమాలో నటించిన ప్రకాశ్ రాజ్ తన పాత్ర కోసం తీసుకున్న రెమ్యునరేషన్ రూ.1.5 కోట్లు కావడం గమనార్హం. దీంతో ఆమెకు ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఎందుకు ఇచ్చారా అంటూ అభిమానులు నెట్టింట చర్చిస్తున్నారు.