Varun -Lavanya : నా లవ్ దొరికింది.. నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేస్తూ వరుణ్, లావణ్య స్పెషల్ పోస్ట్..

తాజాగా వరుణ్ తేజ్ లావణ్యతో నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేసి నా లవ్ దొరికింది అంటూ స్పెషల్ గా పోస్ట్ చేశాడు. దీంతో వీరి నిశ్చితార్థం ఫోటోలు వైరల్ గా మారాయి.

Varun -Lavanya : నా లవ్ దొరికింది.. నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేస్తూ వరుణ్, లావణ్య స్పెషల్ పోస్ట్..

Varun -Lavanya :  హీరో వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఇద్దరూ లవ్ చేసుకుంటున్నారని, డేటింగ్ లో ఉన్నారని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ నేడు జూన్ 9న వీరి నిశ్చితార్థం(Engagement) జరిగింది. నేడు వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం హైదరాబాద్ లోని వరుణ్ తేజ్ ఇంట్లోనే జరిగింది.

ఈ నిశ్చితార్థం చాలా సింపుల్ గా కేవలం మెగా, అల్లు ఫ్యామిలీలు, లావణ్య ఫ్యామిలీలు, అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే జరిగింది. వరుణ్ – లావణ్య నిశ్చితార్థానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వైష్ణవ తేజ్.. ఇలా మెగా, అల్లు ఫ్యామిలీ హీరోలంతా వచ్చి సందడి చేశారు. నిశ్చితార్థం సాయంత్రం జరిగింది.

Sharwanand : శర్వానంద్ రిసెప్షన్‌లో టాలీవుడ్ సెలబ్రిటీస్ సందడి..

తాజాగా వరుణ్ తేజ్ లావణ్యతో నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేసి నా లవ్ దొరికింది అంటూ స్పెషల్ గా పోస్ట్ చేశాడు. దీంతో వీరి నిశ్చితార్థం ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక లావణ్య కూడా ఇదే ఫోటోలను పోస్ట్ చేస్తూ 2016 నుంచే వీరి ప్రేమ ఉన్నట్టు తెలిపింది. ఇక పలువురు అభిమానులు, నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.