Veera Simha Reddy: అఖండ రికార్డులను 8 రోజుల్లోనే బద్దలుకొట్టిన వీరసింహారెడ్డి

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో ఈ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందే క్రియేట్ చేసిన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండటంతో నందమూరి అభిమానులతో పాటు కామన్ ఆడియెన్స్ కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశారు.

Veera Simha Reddy: అఖండ రికార్డులను 8 రోజుల్లోనే బద్దలుకొట్టిన వీరసింహారెడ్డి

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో ఈ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందే క్రియేట్ చేసిన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండటంతో నందమూరి అభిమానులతో పాటు కామన్ ఆడియెన్స్ కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశారు.

Veera Simha Reddy : వీరసింహారెడ్డి సక్సెస్ టూర్ ఫోటో గ్యాలరీ..

సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకెళ్తోంది. ఈ సినిమా ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ మార్క్‌ను క్రాస్ చేసి బాలయ్య కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే ఓవర్సీస్‌లో బ్రేక్ ఈవెన్‌కు చేరుకుని ఔరా అనిపించింది. కాగా, ఈ సినిమా ఎనిమిదో రోజు వసూళ్లతో అదిరిపోయే రికార్డును క్రియేట్ చేసింది. బాలయ్య లాస్ట్ మూవీ అఖండ లైఫ్‌టైమ్ కలెక్షన్లను క్రాస్ చేసి, ఎనిమిదో రోజున వీరసింహారెడ్డి వీరవిహారం చేశాడు.

Veera Simha Reddy : అఖండ తరువాత బాలయ్య ఖాతాలో మరో 100 కోట్ల సినిమా..

రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.60 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టి, ఓవర్సీస్‌తో పాటు రెస్టాఫ్ ఇండియాలో ఎనిమిదో రోజున మరో రూ.10 కోట్లతో.. మొత్తంగా రూ.70 కోట్ల షేర్ వసూళ్లతో అఖండ వసూళ్లను దాటేసింది ఈ మూవీ. కాగా, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్‌కు చేరుకోవాలంటే మరో రూ.4 కోట్ల మేర వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ఇది అవలీలగా ఆ మార్క్‌ను క్రాస్ చేస్తుందని సినీ ఎక్స్‌‌పర్ట్స్ చెబుతున్నారు. శ్రుతి హాసన్, హనీరోజ్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు థమన్ అదిరిపోయే సంగీతాన్ని అందించగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.