Vijay Devarakonda: ‘ఖుషి’ని పక్కనబెట్టి ఆటలాడుతానంటోన్న దేవరకొండ.. నిజమేనా?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’ ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే సామ్ అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు చిత్ర యూనిట్ బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తుండగా, పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది.

Vijay Devarakonda: ‘ఖుషి’ని పక్కనబెట్టి ఆటలాడుతానంటోన్న దేవరకొండ.. నిజమేనా?

Vijay Devarakonda To Do A Sports Drama Movie

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’ ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే సామ్ అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు చిత్ర యూనిట్ బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తుండగా, పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది.

Vijay Devarakonda : అభిమానులను ఫ్రీ హాలీడే ట్రిప్‌కు పంపిస్తున్న విజయ్ దేవరకొండ..

అయితే ఈ సినిమాకు బ్రేక్ పడటంతో రౌడీ స్టార్ ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టులను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడట. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో ఓ సినిమాను కన్ఫం చేశాడు ఈ క్రేజీ హీరో. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కే సూచన కనిపించకపోవడంతో, మరో డైరెక్టర్‌తో తన నెక్ట్స్ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని చూస్తున్నాడట విజయ్. ఈ క్రమంలోనే దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నాడట.

Vijay Devarakonda: రౌడీ స్టార్‌తో స్టార్ డైరెక్టర్ మూవీ.. లేనట్టేనా..?

గౌతమ్ విజయ్‌కు ఓ కథను వినిపించగా, అది నచ్చిన విజయ్ ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో రాబోతుందని తెలుస్తోంది. ఈ ఏడాది లైగర్ అనే మూవీలో మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ చేస్తూ విజయ్ దేవరకొండ కనిపించాడు. ఇప్పుడు మరోసారి స్పోర్ట్స్ నేపథ్యంలో మూవీ కావడంతో రౌడీ ఫ్యాన్స్ ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. మరి గౌతమ్‌తో విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.