ఆకలికి కూడా వ్యాక్సిన్ కనిపెడితే ఎంత బాగుంటుంది! వైరల్ అవుతున్న విజయ్ ట్వీట్..

ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

  • Published By: sekhar ,Published On : May 6, 2020 / 03:37 PM IST
ఆకలికి కూడా వ్యాక్సిన్ కనిపెడితే ఎంత బాగుంటుంది! వైరల్ అవుతున్న విజయ్ ట్వీట్..

ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

ప్రముఖ తమిళనటుడు ‘మక్కల్ సెల్వన్’ ఆకలితో బాధ పడుతున్న పేదవారి గురించి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వతహా విజయ్ సామాజిక కార్యక్రమాలు చేస్తుంటాడు. సినిమాలతో పాటు అతని వ్యక్తిత్వానికి కూడా అభిమానులైన వాళ్లున్నారు. తనపనేదో తనది అని కాకుండా సామాజిక అంశాలపై కూడా తరచూ ఆయన స్పందిస్తుటారు. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్న అంశం గురించి ఆయన ట్వీట్ చేశారు.

‘ఈ భూమ్మీద ఆకలి అనే వ్యాధి ఎప్పటినుంచో ఉంది.దానికి కూడా ఓ వ్యాక్సిన్ కనిపెడితే ఎంత బాగుంటుంది?’ అంటూ విజయ్ చేసిన ట్వీట్‌కు సెలబ్రిటీలు, సామాన్యులు మద్దతు తెలుపుతున్నారు.కాగా కమల్ హాసన్‌తో కలిసి విజయ్ ఇన్‌స్టా చాట్‌లో పాల్గొనగా ఆయన నటనపై కమల్‌ ప్రశంసలు కురిపించారు. ‘నటుడిగా నేను నిన్ను చాలా ఇష్టపడతాను. కమర్షియల్‌ హంగుల వైపు వెళ్లకుండా మీరు స్క్రిప్టును నమ్ముకుంటారు. సక్సెస్‌ ఎప్పుడైనా వస్తుంది.. కానీ స్క్రిప్టును నమ్ముకుని మీరు చేసే ప్రయాణం​ ఎప్పటికీ వృథా కాదు’ అని ప్రశంసించారు కమల్.