Varisu: విజయ్ వారసుడు ఫస్ట్ సింగిల్ ప్రోమోకు ముహూర్తం ఫిక్స్!

తమిళ స్టార్ హీరో థళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ (తెలుగులో వారసుడు) ఇప్పటికే మెజారిటీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ ఫస్ట్ సింగిల్ ప్రోమోను గురువారం సాయంత్రం 6.30 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

Varisu: విజయ్ వారసుడు ఫస్ట్ సింగిల్ ప్రోమోకు ముహూర్తం ఫిక్స్!

Vijay Varisu First Single Song Promo Time Fixed

Varisu: తమిళ స్టార్ హీరో థళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ (తెలుగులో వారసుడు) ఇప్పటికే మెజారిటీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాను తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై తమిళంతో పాటు తెలుగునాట కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో చిత్ర యూనిట్ రూపొందిస్తుండటంతో ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వచ్చినా అభిమానులు ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు.

Varisu : ఇది పక్కా తమిళ సినిమా.. తెలుగులోకి డబ్ చేస్తున్నాం.. విజయ్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన వంశీ పైడిపల్లి..

అయితే ఈ సినిమా నుండి ఇప్పటివరకు కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రమే వచ్చాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తుండగా, తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ ఫస్ట్ సింగిల్ ప్రోమోను గురువారం సాయంత్రం 6.30 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

Varisu: కళ్లు చెదిరే రేటుకు విజయ్ ‘వారిసు’ మూవీ నాన్-థియేట్రికల్ రైట్స్!

ఈ అప్డేట్‌తో విజయ్ అభిమానుల్లో ఈ సినిమాపై మరింత ఆతృత పెరిగింది. ఇక పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండగా, ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోండగా, థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి వారిసు ఫస్ట్ సింగిల్ ప్రోమోకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.