Varisu: కళ్లు చెదిరే రేటుకు విజయ్ ‘వారిసు’ మూవీ నాన్-థియేట్రికల్ రైట్స్!

తమిళ స్టార్ హీరో, ఇళయథళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై తెలుగునాట కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది.

Varisu: కళ్లు చెదిరే రేటుకు విజయ్ ‘వారిసు’ మూవీ నాన్-థియేట్రికల్ రైట్స్!

Vijay Varisu Movie Non-Theatrical Rights Sold For Bomb

Vaarisu: తమిళ స్టార్ హీరో, ఇళయథళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై తెలుగునాట కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ, త్వరలోనే షూటింగ్‌ను ముగించుకోనుంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో రోజుకో వార్త హల్‌చల్ చేస్తోంది.

Vaarasudu: ‘వారసుడు’ రాకతో నిజమైన సంక్రాంతి..!

తాజాగా ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది. వారిసు చిత్రంపై తమిళనాట భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీని కారణంగా ఈ చిత్ర నాన్-థియేట్రికల్ రైట్స్‌ను ఏకంగా రూ.120 కోట్లకు అమ్మినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రైమ్ వీడియో ఏకంగా రూ.60 కోట్ల భారీ రేటుకు కొనుగోలు చేయగా, శాటిలైట్ రైట్స్‌ను సన్ నెట్‌వర్క్ రూ.50 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్ర ఆడియో రైట్స్ రూపంలో మరో రూ.10 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

Vijay Vaarasudu: వారసుడు అప్పుడే ముగిస్తాడట.. ఆ తరువాత..?

నాన్-థియేట్రికల్ రైట్స్ ఈ స్థాయిలో బిజినెస్ జరగడంతో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం అవుతోంది. ఇక ఈ సినిమాను తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్‌తో చిత్ర యూనిట్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.