Vishnu Vishal : రవితేజ నిర్మాతగా తమిళ్ హీరోతో కొత్త ప్రయోగం

విష్ణు విశాల్‌ హీరోగా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా చెల్లా అయ్యావు దర్శకత్వంలో RT టీమ్‌ వర్క్స్‌, విష్ణు విశాల్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

Vishnu Vishal : రవితేజ నిర్మాతగా తమిళ్ హీరోతో కొత్త ప్రయోగం

Raviteja

 

Raviteja :  మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టాడు. ఇప్పటికే రవితేజ నిర్మాణ సంస్థ RT టీం వర్క్స్ లో మూడు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇటీవల తమిళ్ హీరో విష్ణు విశాల్ హీరోగా చేసిన FIR సినిమాని తెలుగులో రవితేజనే విడుదల చేశారు. ప్రస్తుతం రవితేజ నిర్మాణంలో విష్ణు విశాల్ హీరోగా తమిళ్ – తెలుగు ద్విభాషా సినిమాని రూపొందిస్తున్నారు.

Arya : గ్రహాంతర వాసితో పోరాటంపై ఇండియాలో మొట్టమొదటి సినిమా

దీనికి సంబంధించిన టైటిల్ మోషన్ పోస్టర్ ని తాజాగా విడుదల చేశారు. విష్ణు విశాల్‌ హీరోగా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా చెల్లా అయ్యావు దర్శకత్వంలో RT టీమ్‌ వర్క్స్‌, విష్ణు విశాల్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి ‘మట్టి కుస్తీ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. రెజ్లింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్‌ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. అందుకు తగ్గట్లుగా ‘మట్టి కుస్తీ’ అనే టైటిల్‌ ని ఖరారు చేశారు. ఇందులో విష్ణు విశాల్‌ పవర్ ఫుల్ పాత్రని పోషించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. మరి తమిళ హీరోతో రవితేజ చేసే ఈ ప్రయోగంలో నిర్మాతగా ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.