Vishwak Sen: ఇద్దరు హీరోయిన్లతో మాస్ కా దాస్ రొమాన్స్.. మామూలుగా ఉండదట!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Vishwak Sen: ఇద్దరు హీరోయిన్లతో మాస్ కా దాస్ రొమాన్స్.. మామూలుగా ఉండదట!

Vishwak Sen To Romance These Heroines In His Next Movie

Vishwak Sen: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల ‘ధమ్కీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాను విశ్వక్ స్వయంగా డైరెక్ట్ చేయడంతో, ఈ సినిమాపై ఫ్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. డ్యుయెల్ రోల్‌లో విశ్వక్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ మూవీని కూడా ఇప్పటికే అనౌన్స్ చేశాడు ఈ హీరో.

Vishwak Sen : సూపర్ హిట్ కాంబినేషన్‌తో వస్తున్న విశ్వక్.. తనలోని బ్యాడ్‌ని పరిచయం చేస్తాడట!

విశ్వక్ కెరీర్‌లో 11వ చిత్రంగా రాబోతున్న మూవీని VS11 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కృష్ణచైతన్య డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో విశ్వక్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో అందాల భామలు నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Vishwak Sen: గామి మూవీపై విశ్వక్ ఓపెన్ అయ్యాడుగా.. ఏమన్నాడంటే..?

సితార ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తోంది. ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించనున్నాడు. మరి ఈ సినిమాలో నిజంగానే విశ్వక్ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తాడా.. అనే విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.