Waltair Veerayya: వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ ఊచకోత.. పది రోజుల్లోనే డబుల్ సెంచరీ!

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించగా, చాలా రోజుల తరువాత బాస్ ఊరమాస్ అవతారంలో నటించడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఉవ్విళ్లూరారు. ఇక ఈ సినిమాను పక్కా పండగ కానుకగా రిలీజ్ చేయడంతో థియేటర్లలో మెగా ఫ్యాన్స్ సందడి కనిపించింది.

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ ఊచకోత.. పది రోజుల్లోనే డబుల్ సెంచరీ!

Waltair Veerayya Crosses Rs.200 Crores In 10 Days

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించగా, చాలా రోజుల తరువాత బాస్ ఊరమాస్ అవతారంలో నటించడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఉవ్విళ్లూరారు. ఇక ఈ సినిమాను పక్కా పండగ కానుకగా రిలీజ్ చేయడంతో థియేటర్లలో మెగా ఫ్యాన్స్ సందడి కనిపించింది.

Waltair Veerayya : అమెరికాలో మెగాస్టార్ మరో రికార్డు.. కొనసాగుతున్న వాల్తేరు వీరయ్య ప్రభంజనం..

ఈ మూవీలో చిరంజీవి ఊరమాస్ గెటప్, ఆయన పర్ఫార్మెన్స్ అభిమానులకు కావాల్సినంత కిక్ ఇచ్చింది. అటు మాస్ రాజా రవితేజ పవర్‌ఫుల్ రోల్ కూడా ఈ సినిమాకు మరింత బలాన్ని అందించింది. దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే సంగీతానికి థియేటర్లలో ఆడియెన్స్ డ్యాన్సులు చేశారు. ఓవరాల్‌గా పండగకు పక్కా ఊరమాస్‌గా ఈ సినిమా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. తొలిరోజు నుంచే ఈ సినిమాకు సాలిడ్ కలెక్షన్స్ వచ్చాయి.

Waltair Veerayya : ఏపీలో RRR రికార్డును బద్దలు కొట్టిన వీరయ్య..

అయితే సినిమా రిలీజ్ అయ్యి రోజులు గడుస్తున్నకొద్దీ కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు. దీంతో తాజాగా ఈ సినిమా రిలీజ్ అయిన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ స్టామినా కనిపించింది. ఈ సినిమా ఏకంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందని చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. ఈ సినిమాతో చిరంజీవి మరోసారి తన విశ్వరూపాన్ని చూపించారని అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.