Puneeth Rajkumar : 50 రకాల వంటకాలతో పునీత్ రాజ్ కుమార్ కి పూజలు

పునీత్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఇంకా శోక సంద్రంలోనే ఉన్నారు. ఇక అంతక్రియలు ముగిశాక వారి సంప్రదాయం ప్రకారం పూజలు చేయాల్సి ఉంటుంది. వారి సంప్రదాయం ప్రకారం పునీత్‌ రాజ్‌కుమార్‌

Puneeth Rajkumar : 50 రకాల వంటకాలతో పునీత్ రాజ్ కుమార్ కి పూజలు

Puneeth (1)

Puneeth Rajkumar :  కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం అందర్నీ కలవరపెట్టింది. కన్నడ ప్రజలు ఈ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఇంకా శోక సంద్రంలోనే ఉన్నారు. ఇక అంతక్రియలు ముగిశాక వారి సంప్రదాయం ప్రకారం పూజలు చేయాల్సి ఉంటుంది. వారి సంప్రదాయం ప్రకారం పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధికి కుటుంబ సభ్యులు నిన్నటి నుంచి ఐదు రోజుల పాలశాస్త్రం పూజలు నిర్వహిస్తున్నారు.

Sai Pallavi : అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. కానీ ఛాన్స్ రావట్లేదు : సాయి పల్లవి

నిన్న ఉదయం 11 గంటలకు కంఠీరవ స్టూడియోలోని పునీత్‌ సమాధి వద్దకు కుటుంబ సభ్యులు చేరుకున్నారు. పునీత్ కి ఎంతో ఇష్టమైన ఇడ్లి, రాగిముద్ద, నాటుకోడి సాంబారుతో పాటు మరో 50 రకాల వంటకాలను వండించారు. ఈ వంటకాల్ని సమాధిపై పెట్టి పూజలు చేశారు. భార్య అశ్విని, కూతుర్లు ధృతి, వందితా, అన్నలు శివరాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ మరియు ఇతర కుటుంబ సభ్యులు, కొంత మంది రాజకీయ ప్రముఖులు కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు. మరో నాలుగు రోజుల పాటు ఈ పూజలు ఉండొచ్చని తెలుస్తుంది.